ఎస్ ఇప్పుడు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో ఇదే మాట ప్రముఖంగా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్రారంభం నుంచి ఆయన బావమరిది అల్లు అరవింద్ వెన్నుముకగా ఉంటూ వచ్చారు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఆ సినిమా బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి పోటీగా థియేటర్లలోకి రిలీజ్ అయింది. శాతకర్ణికంటే.. ఖైదీ 150 సినిమా సూపర్ హిట్ అని చెప్పుకునేందుకు అల్లు అరవింద్ కూడా ఎంతో అపసోపాలు పడ్డారు. వసూళ్లపరంగా చిరంజీవి సినిమాకే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అయితే సైరా సినిమా నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది.
చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక అల్లు అరవింద్ బ్యానర్‌లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న గ్యాప్ నేపథ్యంలో ఆ సినిమా సైడ్ అయిపోయింది. చిరంజీవి వరుసగా బయట బ్యానర్ల సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక చిరంజీవి పదేళ్లపాటు సినిమాలుకు దూరంగా ఉన్నప్పుడు తనయుడు రామ్‌చరణ్ కథలను జడ్జి చేసే బాధ్యత కూడా అల్లు అరవింద్‌కే అపచెప్పారు. అయితే అరవింద్ మంచి కథ వస్తే దానిని తన తనయుడు బన్నీ కోసం బ్లాక్ చేయడం మొదలుపెట్టిన విషయం తెలుసుకున్న చిరంజీవి.. క్రమంగా చరణ్‌కథలు కూడా తానే వింటూ సెలెక్ట్ చేస్తున్నారు. అలా తెలియకుండానే ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగింది.
ఇక చిరంజీవికి కెరీర్ పరంగా నాలుగు దశాబ్దాల నుంచి పోటీ హీరోగా కొనసాగుతున్నారు బాలయ్య. నటసింహం బాలయ్యతో తన ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్‌షో చేయడంతో ఇటు అల్లు అరవింద్ ఆహాతో పాటు.. బాలయ్యకు తిరుగేలేని క్రేజ్ వచ్చింది. దెబ్బతో బాలయ్యకు అల్లూ ఫ్యామిలీకి బాండింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు గీతా బ్యానర్ లో బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో అరవింద్ సినిమా ప్లాన్ చేశారు. అటు చిరంజీవితో సినిమా అనుకున్నా.. చిరంజీవి డేట్లు ఇవ్వలేదు. ఇప్పుడు బాలయ్య అరవింద్ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జీవిత – రాజశేఖర్ దంపతులు తీవ్రమైన విమర్శలు చేశారు.
ఆ టైంలో అరవింద్.. జీవిత – రాజశేఖర్ దంపతులకు గట్టి కౌంటర్ ఇచ్చి చిరంజీవికి ఎంతో అండగా నిలబడ్డారు. చివరకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై వీరు విమర్శలు చేసినప్పుడు కూడా అరవింద్ ఎంతో అండగా నిలిచారు. అలాంటిది ఇప్పుడు జీవిత – రాజశేఖర్ దంపతుల పెద్ద కుమార్తె శివాత్మిక అల్లు అరవింద్‌కే చెందిన గీతా ఆర్ట్స్ 2లో వస్తున్న కోటబొమ్మాలి పీఎస్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండడంతో.. విభేదాల నేపథ్యంలో ఆ బ్యానర్లు సినిమా చేయటం ఏంటని ? ఆమెను చాలామంది ప్రశ్నిస్తే అవన్నీ సమసిపోయాయని ఆమె ఆన్సర్ చేసింది. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరిగినా అవేవి మేం పట్టించుకోం.. మేమంతా ఒక్కటే సినిమా ఫ్యామిలీ అని చెప్పింది.
ఇలా చిరంజీవి ఫ్యామిలీకి బద్ధ శత్రువులుగా ఉన్నవారితో అల్లు అరవింద్ స్నేహం కొనసాగిస్తున్న పరిస్థితి. వీరు మాత్రమే కాదు ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్లు, కొందరు ఇండస్ట్రీ జనాలతో అరవింద్ చాలా సఖ్యతతో ఉంటున్నారని వారిలో చాలామంది చిరంజీవితో అంత సఖ్యత లేని వారిని చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా పైకి ఎంత చెప్పుకున్నా అంతర్గతంగా చిరు, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వారైతే నడుస్తోంది అన్నది వాస్తవం.