సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలను ట్రెండ్ అవుతున్నాయి. వీటిల్లో ఏది నిజం..? ఏది అబద్దం..? అని చెప్పడం చాలా చాలా కష్టమైపోతుంది . అయితే పలువురు స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు పదే పదే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రీసెంట్గా చిరంజీవికి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే చిరంజీవి ఇండస్ట్రీలో మెగాస్టార్ .. నెంబర్ వన్ హీరో ఇప్పటికి అదే స్థానాన్ని కంటిన్యూ చేస్తున్నాడు .
అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే . అప్పట్లో ప్రజారాజ్యం అని ఓ పార్టీని పెట్టి సగంలో మెయింటైన్ చేయలేక చేతులెత్తేసాడు . అయితే ఇదే టైంలో చిరంజీవి తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ గ్రాండ్ సభను ఏర్పాటు చేశారు . ఈ సభలో కొందరు ఆయనపై టమాటాలు, గుడ్లు కూడా విసిరారు . అయితే చిరంజీవి ఆ సభలో ఉన్నప్పుడు ఓ స్టార్ హీరోయిన్ తల్లి ఆయనపై చెప్పు వేయడానికి ట్రై చేసిందట. దానికి కారణం ఆమె కూతురు .
ఆయన కారణంగానే ఆమె కూతురి కెరీర్ నాశనం అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆ హీరోయిన్ ని చిరంజీవి సినిమాలో ఛాన్స్ వస్తే చిరంజీవి లుక్స్ బాగోలేవు అంటూ పెట్టలేదట . . చిరంజీవి రిజెక్ట్ చేసిన హీరోయిన్ ని ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఆదరించలేదు. తద్వారా ఆమె కెరియర్ డౌన్ అయిపోయింది . ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయింది . ఆ బాధ తట్టుకోలేక ఆమె ఫుల్ డిప్రెషన్ కి గురైపోయింది . దీంతో కూతురు బాధ చూడలేక ఆ హీరోయిన్ తల్లి ఆ పార్టీ సభలో ఆయనపై చెప్పు విసరాలాని చూసిందట . కానీ అప్పటికే అక్కడ గోల గోల జరగడంతో ఆమె సైలెంట్ అయిపోయి పక్కకు వచ్చేసిందట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పదే పదే వైరల్ అవుతుంది..!!