Newsస్టార్‌ హీరోయిన్ అవ్వాల్సిన సదా కెరీర్ నాశ‌నం చేసిన టాప్ డైరెక్ట‌ర్‌...!

స్టార్‌ హీరోయిన్ అవ్వాల్సిన సదా కెరీర్ నాశ‌నం చేసిన టాప్ డైరెక్ట‌ర్‌…!

సదా..ఓ సాధారణ ముస్లిం కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి. మామూలుగా అయితే ముస్లిం కుటుంబంలో ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి. వాళ్ళు కనీసం ముఖం చూపించడానికి కూడా ఒప్పుకోరు. ఇది వారి ఆచారం. అలాంటిది సదా ఏకంగా హీరోయిన్ అయిపోయింది. తనకి అమ్మా నాన్నల సపోర్ట్ ఉండటం వల్లే హీరోయిన్ గా నటించానని చెప్పిన సందర్భాలున్నాయి.

నితిన్ హీరోగా పరిచయమైన సినిమా జయం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. దాంతో తెలుగు ఇండస్ట్రీలో సదా పేరు మార్మోగిపోయింది. దర్శకుడు తేజ పరిచయం చేసిన హీరోయిన్స్ లో కాజల్ తర్వాత కొన్ని ఎక్కువ సినిమాలలో కనిపించింది అంటే సదానే. శంకర్ లాంటి అగ్ర దర్శకుడు సదాకి ఛాన్స్ ఇచ్చారంటే ఆమెలోని టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సదా తెలుగులో జయం, నాగ, లీలామహల్ సెంటర్, దొంగ – దొంగది, ఔనన్నా కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, వీరభద్ర, క్లాస్ మేట్స్, టక్కరి, అపరిచితుడు, యమలీల 2 లాంటి సినిమాలలో నటించింది. వీటిలో కొన్ని సినిమాలు సూపర్ హిట్స్ గా కూడా నిలిచాయి. అయితే, శంకర్ సినిమాలలో నటించిన హీరోయిన్స్ కి కెరీర్ ఉండద‌ని ఓ మాట వినిపిస్తుంటుంది. అదే సదా విషయంలో కూడా జరిగి ఉంటుంది. విక్రం హీరోగా వచ్చిన అపరిచితుడు తమిళంలో కంటే తెలుగులో భారీ హిట్ సాధించింది.

అయితే, ఈ సినిమా తర్వాత ఎందుకో సదా కెరీర్ ఆగిపోయింది. మళ్ళీ ఇటు తెలుగులో గానీ, అటు తమిళంలో గానీ పెద్ద సినిమాలలో ఛాన్సులు అందుకోలేకపోయింది. ఇదతందా శంకర్ చేతివాటమే అనుకుంటారు. ఇలియానా కూడా ఇదే పరిస్థితి. ఎందుకో మరి శంకర్ దర్శకత్వంలో నటించిన హీరోయిన్స్ కెరీర్ మధ్యలోనే ఆగిపోతుంది. కాకపోతే, సదా ఇటీవల కాలంలో ఎక్కువ బుల్లితెర మీద సందడి చేస్తుంది. వెయ్య వయ్యా వేయ్..అంటూ అలరిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news