Newsపెళ్లైన స్టార్ హీరో కూతురుతో ప్రేమ‌లో ప‌డ్డ స్టార్ డైరెక్ట‌ర్‌... ఈ...

పెళ్లైన స్టార్ హీరో కూతురుతో ప్రేమ‌లో ప‌డ్డ స్టార్ డైరెక్ట‌ర్‌… ఈ ఘాటు ప్రేమ ఎలా పుట్టిందంటే..!

సినిమా రంగంలో మరో సెలబ్రిటీ వివాహానికి రంగం సిద్ధమవుతోంది. తమిళ‌ సీనియర్ నటుడు ప్రభు తన కుమార్తెకు రెండో పెళ్లి చేయబోతున్నారు. ఐశ్వర్య పెళ్లి ఖాయమైనట్టు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రభు కుమార్తె లెజెండ్ శివాజీ గణేషన్ మనవరాలు ఐశ్వర్యకు ఇంతకుముందే ఒక పెళ్లి అయ్యింది. 2008లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆ పెళ్లి నిలవలేదు.

తర్వాత చాలా రోజులపాటు అమెరికాలో ఉన్న ఐశ్వర్య ఇటీవలే చెన్నై వచ్చారు. ఈ ఏడాది విశాల్‌తో మార్క్ ఆంటోనీ లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. అధిక్ రవిచంద్రన్ – ఐశ్వర్య ఇద్దరు గతంలో స్నేహితులు. ఒకరికొకరు బాగా తెలుసు ఐశ్వర్య భర్తకు విడాకులు ఇచ్చాక ఇద్దరు మధ్య పాత స్నేహం చిగురించి. ప్రేమలో పడ్డారు.

ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నారు. వీరిద్దరి పెళ్ళికి ఐశ్వర్య తండ్రి ప్రభు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక అధిక్ తమిళంలో విశాల్ హీరోగా మార్క్ ఆంటోనీ సినిమా తెరకెక్కించి.. సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఏకంగా త‌ళ అజిత్‌తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా పనులలో బిజీబిజీగా ఉన్నాడు.

ఇక ఐశ్వర్య తండ్రి ప్రభు సౌత్లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఐశ్వర్య సోదరుడు విక్రమ్ ప్రభు కూడా కోలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news