Moviesఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ చెంప పై కొట్టిన యువతి..వీడియో వైరల్..!!

ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ చెంప పై కొట్టిన యువతి..వీడియో వైరల్..!!

ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ మరీ హద్దులు మీరి పోతున్నారా..? అంటే అవుననే చెప్పాలి. మరీ ముఖ్యంగా మన ఫేవరెట్ హీరో హీరోయిన్ కనపడితే వాళ్లతో ఫోటోలు దిగడానికి సెల్ఫీలు తీసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. కొందరు స్టార్ హీరోలు అలాంటి వాటిని అవాయిడ్ చేస్తే వెళ్ళిపోతూ ఉంటారు . మరి కొంతమంది మాత్రం ఓపికగా ఫ్యాన్స్ కు ఫోటోగ్రాఫ్ ఇస్తూ ఉంటారు.

అయితే ఇదే క్రమంలో ఓ అమ్మాయి తన ఫేవరెట్ హీరో ఫోటో ఇవ్వడం పట్ల ఓవర్ గా రియాక్ట్ అయ్యి.. ఏకంగా అతగాడి చెంపపై కొట్టింది. ప్రజెంట్ ఇదే వీడియో నెట్టింట వైరల్ గా మారింది . ఆ హీరో మరెవరో కాదు పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ . రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్నప్పుడు తన ఫ్యాన్ ఎదురుపడుతుంది .

ఇదే మూమెంట్లో ప్రభాస్ సైతం ఓపికగా అమ్మాయి .. భుజంపై చేయి వేసి ఫోటోకి ఫోజులు ఇస్తాడు. అయితే అమ్మాయి తట్టుకోలేక ఫోటో అయిపోయిన తర్వాత ప్రభాస్ చెంపపై ప్రేమగా కొట్టింది . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది . దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆమె ఓవర్ గా ఎక్సైట్ అయ్యింది..అంటీ ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే .. మరి కొందరు మాత్రం ప్రభాస్ ప్లేస్ లో బాలయ్య ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఊహించుకోండి అంటూ ఫన్నీగా కౌంటర్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news