డిసెంబర్ చివర్లో రాబోతున్న అతిపెద్ద సినిమా సలార్. అసలు సలార్ సినిమాపై కనివిని ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్న మాట వాస్తవం. ఈ సినిమా డైనోసార్ గా బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తుందని ఒకటే మాట్లాడుకుంటున్నారు. మామూలుగా సెప్టెంబర్ 28న రిలీజ్ అయిపోవాలి.. అనూహ్య కారణాలతో సలార్ డిసెంబర్ 22 కు వాయిదా పడింది. అదే టైంలో షారుఖ్ ఖాన్ ఢుంకీ సినిమాతో పాటు హాలీవుడ్ సినిమా కూడా సలార్ కు పోటీగా వస్తున్నాయి. దీంతో అటు ఓవర్సీస్ లోను ఇటు ఇండియాలోనూ సలార్‌కు ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా లేదు.
సోలోగా రిలీజ్ అయి ఉంటే ఆ సినిమా రేంజ్ వేరుగా ఉంటుంది.. ఇప్పుడు గట్టి పోటీ మధ్యలో సలార్ వస్తోంది. థియేటర్లు కూడా పంచుకోవాలి.. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలలో జరుగుతున్న చర్చ రకరకాల సందేహాలకు తావిచ్చేలా ఉంది. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కాంతారా లాంటి సినిమాలు తక్కువ కమీషన్ మీద.. అస్సలు పెద్దగా అడ్వాన్సులు కూడా తీసుకోకుండా నేరుగా విడుదల చేసుకొని భారీ లాభాలు తిన్న నిర్మాత విజయ్ కిరంగాదూర్ ఇప్పుడు సలార్‌పై ఎలాగైనా నాన్ రిటర్న్ అడ్వాన్సుల మీద అమ్మేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్ర నుంచి 100 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అలా రానిపక్షంలో 75 కోట్లకు కూడా తగ్గిపోతున్నారు. రేటు తగ్గుతున్నా కూడా బయ్యర్లు ఎందుకు ధైర్యంగా ? ముందుకు రావడం లేదు అన్నది రెండో డిస్కషన్. ట్రేడ్ వర్గాలకు ఎక్కడో ఏదో తేడా కొడుతోందంటున్నారు. ఈ సినిమాపై మరికొన్ని గాసిప్పులు కూడా వినిపిస్తున్నాయి. హీరో ప్రభాస్, సినిమా దర్శకుడు ప్రశాంత నీల్‌కు.. నిర్మాతలకు మధ్య పొరాపచ్చలు వచ్చాయి అన్నది ఆ గుసగుసలు సారాంశం. సినిమా కంటెంట్ క్వాలిటీ మీద ప్రభాస్ సంతృప్తిగా లేరని తెలుస్తోంది. అలాగే రిలీజ్ డేట్ విషయంలో కూడా ప్రభాస్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
బాలీవుడ్ లో సరైన డేట్ కాదని ప్రభాస్ చెప్పిన నిర్మాతలు అంగీకరించడం లేదని అంటున్నారు. దీంతో ఈ సినిమా విషయంలో ప్రభాస్ సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు.. సలార్ సినిమా కంటెంట్ క్వాలిటీ విషయంలో కూడా అసంతృప్తితో ఉన్నాడంటున్నారు. సినిమా విడుదల మరో ఆరేడు వారాల్లో ఉంది. రెండు మూడు వారాల తర్వాత ప్రచారం మొదలు పెడతారో లేదో కూడా తెలియట్లేదు. ఒకవేళ ప్రభాస్ కనక ప్రచారంలో పాల్గొనుకుంటే ఈ సినిమా మీద వస్తున్న గాసిప్‌లు అన్ని నిజమే అని అనుకోవాల్సి ఉంటుంది.