సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సౌందర్య గారికి పోటీ రారు ..రాబోరు.. రాలేరు అన్న విషయం అందరికీ తెలిసిందే . అందం విషయంలో నటన విషయంలో కట్టుబొట్టు విషయంలో మాట్లాడే విధానం విషయంలో సౌందర్య గారి తర్వాతే ఏ హీరోయిన్ అయినా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పుడు మనం ఎంతో పెద్ద పెద్ద స్టార్స్ గా భావిస్తున్న హీరోయిన్స్ అందరూ కూడా సౌందర్య గారి కాలి గోటికి కూడా సరిపోరు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ టైం లోనే బాగా పాపులారిటీ సంపాదించుకున్న సౌందర్య అంతకు డబల్ రేంజ్ లో తనపై గాసిప్స్ క్రియేట్ అయ్యే విధంగా కూడా నడుచుకునింది.
మరీ ముఖ్యంగా అందరితో చనువుగా క్లోజ్ గా హ్యాపీగా మాట్లాడడమే ఆమె పాలిట శాపంగా మారింది . ఇలాంటి క్రమంలోని ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోతో కూడా ఎఫైర్ కట్టేశారు అప్పట్లో జనాలు .కాగా అలాంటి టైం లోనే సౌందర్య మరణించక ముందు ఓ వ్యక్తి నుంచి ఏకంగా 200 కోట్ల ఆస్తిని గిఫ్ట్ గా తీసుకుంది అన్న విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . గతంలో నటి సౌందర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోతో బాగా చనువుగా మూవ్ అయింది అని ..ప్రైవేట్ పార్టీస్ కి కూడా ఎంజాయ్ చేసింది అంటూ పుకార్లు వినిపించాయి .
అయితే ఇందులో ఎంత నిజం ఉందో వాళ్ళకి ఆ దేవుడికే తెలియాలి. కానీ సౌందర్య అలాంటి వ్యక్తి కాదు అంటూ జనాలు బుద్ధి చెప్పారు. అయితే అదే టైంలో సౌందర్యకు ఏకంగా 200 కోట్ల ఆస్తి కలిగిన ప్రాపర్టీని గిఫ్ట్ గా ఆ హీరో ఆమెకు ఇచ్చారట . అయితే ఆమె మరణించాక ఆమె ఆస్తిని ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు ఫేక్ పత్రాలు సృష్టించి తన పేరు మీద రాయించుకున్నారట . అంతేకాదు సౌందర్య కష్టపడి సంపాదించిన ఆస్తిని మొత్తం ఆయన భార్య ఆయన భర్త దొబ్బేసాడని .. ఆమె తల్లిదండ్రులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అన్న వాదనలు కూడా ఎక్కువగా వినిపించాయి.