సీనియర్ ఎన్టీఆర్ కి కెరియర్ ప్రారంభం నుంచి హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉండేది. ఆయన ఎంతోమంది హీరోయిన్లను పరిచయం చేసినా వారు ఎక్కువగా ఏఎన్నార్ తో నటించేందుకు ఇష్టపడేవారట. అందుకే ఆయన చాలామంది హీరోయిన్లను పరిచయం చేసి వారికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించేవారు. అలాంటివారిలో దేవిక ఒకరు. పాతతరం హీరోయిన్లలో మేటినటి దేవిక.. ఇంకా చెప్పాలి అంటే కృష్ణకుమారి కంటే ముందు ఎన్టీఆర్ లవర్ గా దేవిక పేరు చెప్పేవారు.
ఎన్టీఆర్, దేవిక కలిసి జానపద సినిమాలతో.. పాటు పౌరాణిక సినిమాలలోనూ నటించారు. కెరీర్ ప్రారంభంలో దేవిక అయితే ఎన్టీఆర్.. లేకపోతే కత్తి కాంతారావు సరసన ఆమె హీరోయిన్గా తెరను పంచుకున్నారు. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా దాని గురించి ఆలోచించకుండా కేవలం కథా బలం ఉన్న సినిమాలు చేసేందుకే ఆమె ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ తర్వాత ఆమె తన వారసురాలిగా తన కుమార్తెను వెండితెరకు పరిచయం చేశారు. ఆమె పేరు కనక కేవలం తెలుగులో రెండు సినిమాల మాత్రమే చేసింది.
అది కూడా ఒకటి ఎన్టీఆర్ తో బ్రహ్మర్షి విశ్వామిత్ర.. రెండోది రాజేంద్రప్రసాద్ కు జోడిగా వాలుజడ.. తోలు బెల్టు అయితే తమిళంలోనూ, మలయాళంలోనూ కనక అనేక సినిమాలలో నటించి తన ప్రతిభను చాటుకుంది. ఆమె సినిమా రంగంలో ఎక్కువకాలం నిలబడలేదు. కనుక నటన బాగున్నా తన తల్లి దేవిక డామినేషన్ ఆమె కెరీర్ పై ప్రభావం చూపిందని అంటారు. దేవిక సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో ఉండడంతో కనుకను ఎప్పుడు స్వేచ్ఛగా ఉండనిచ్చేదే కాదట.
సినిమా రంగంలో చాలా మంది నమ్మించి మోసం చేస్తారని.. ఎవరిని నమ్మకూడదని చెబుతూ ఉండడంతో పాటు ఇంటికి కూడా ఎవరిని రానిచ్చేవారు కాదట . ఇక తన జీవితంలో ఎదురైన ఘటనల నేపథ్యంలో కుమార్తె కనక ఎక్కడికి వెళ్లినా ఆమె వెంట దేవిక కూడా వెళ్ళలేదట. తరచూ మేకప్ మెన్లను కూడా మార్చేసేదట. హీరోలతో కూడా ఎక్కువగా మాట్లాడనిచ్చే వారే కాదట .ఇది కనక కెరీర్ను బాగా దెబ్బ కొట్టిందని ఆమెకు టాలెంట్ ఉన్నా ఎక్కువ అవకాశాలు రాకుండా పోయాయని చెబుతారు.