వామ్మో.. ఏంటిది పల్లవి ప్రశాంత్ కి పెళ్లి అయిపోయిందా..? ప్రెసెంట్ ఆయన పెళ్లికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పల్లవి ప్రశాంత్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎలా పాపులారిటీ సంపాదించుకున్నాడో మనకు తెలిసిందే. రైతుబిడ్డ అంటూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయాడు . ఆ హోదాతోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి అవకాశం దక్కించుకొని హౌస్ లోపలికి వెళ్లి తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ సింపతిని సంపాదించుకుంటున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మరోపక్క అమ్మాయిలతో పులిహోర కూడా కలుపుతున్నాడు ఈ రైతుబిడ్డ అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. తాజాగా ప్రశాంత్ కి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోలో పల్లవి ప్రశాంత్ తన భార్యతో కనిపిస్తున్నాడు . పెళ్లి బట్టల్లో వధువు పక్కనే మెరిసిపోతున్నాడు . ఈ ఫోటో చూసి అభిమానులు షాక్ అయిపోతున్నారు.
అరెరే మా పల్లవి ప్రశాంత్ కి ఎప్పుడు పెళ్లయింది అంటుంటే .. మరి కొంతమంది ఇది రియల్ పెళ్లి కాదు అంటూ చెప్పుకొస్తున్నారు . ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ తండ్రి త్వరలోనే ఆయనకు పెళ్లి చేయబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇది ఆయన ఒరిజినల్ ఫోటో కాదు అని ఎవరో కావాలని మార్ఫింగ్ చేసి ఆయనను బ్యాడ్ చేయడానికి వైరల్ చేస్తున్నారని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!