Movies"నీ కొడుకుని త్వరగా హీరో చేయవమ్మ".. విజయేంద్ర ప్రసాద్ మాటలకి రేణు...

“నీ కొడుకుని త్వరగా హీరో చేయవమ్మ”.. విజయేంద్ర ప్రసాద్ మాటలకి రేణు దేశాయ్ ఏం చేసిందో చూడండి..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోల కొడుకులు ఎంట్రీ ఇవ్వడం కామన్ గా అయిపోయింది . మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ కి సంబంధించిన పిల్లలు తమ బెర్త్లను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు . రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు కూడా ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు అన్న వార్త ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాం . దానిపై రేణు దేశాయ్ క్లారిటీ కూడా ఇచ్చింది . తన కొడుకుకి ఇండస్ట్రీలో హీరోగా రావడం ఇష్టం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది .

అయితే పవన్ కళ్యాణ్ కొడుకు హీరో అయితే చూడాలి అంటూ పవన్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే తాజాగా ఆమె నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదే సిచువేషన్ ఫేస్ చేసింది రేణు దేశాయ్. మాస్ మహారాజు రవితేజ నటించిన తొలిప్రేమ చిత్రం టైగర్ నాగేశ్వరరావు . ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతుంది.

రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రేణు దేశాయ్ కి స్ట్రైట్ గా తన మనసులోని మాటను చెప్పేసాడు . ‘రేణు దేశాయ్ మీరు సినిమా ఇండస్ట్రీకి దూరం కావచ్చు ..కానీ మీరు మాకు ఎప్పుడు దగ్గరే.. మీ కొడుకు అకిరాను హీరో చేయండి ..చాలామంది ఫాన్స్ కోరుకుంటున్నారు “అంటూ ఓపెన్ గా అడిగేసారు . దీంతో వెంటనే రేణు దేశాయ్ చేతులు పైకెత్తుతూ తెగ ఆనందపడిపోయింది. ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి . అయితే ఫాన్స్ అడిగితే మాత్రం ఫుల్ ఫైర్ అయిపోయారు.. విజయేంద్ర ప్రసాద్ అడిగితే మాత్రం ఇలా క్రేజీ రియాక్షన్ ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news