టాలీవుడ్ లో లేడీస్ సూపర్ స్టార్ గా అప్పట్లో స్టార్ హీరోలకు సైతం చెమటలు పట్టించిన ఘనత లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబచ్చన్, విజయశాంతి దక్కుతుంది. బాలనటిగానే కెరీర్ ప్రారంభించిన విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా అప్పట్లో స్టార్ హీరోల సినిమాలతో సమానంగా వసూళ్లు కొల్లగొట్టారు. దీంతో ఆమె రేంజ్, రెమ్యూనరేషన్ అమాంతం పెరిగిపోయాయి.
భారత్ బంద్ – ప్రతిఘటన – కర్తవ్యం లాంటి సినిమాలు తన సినిమాలలో హీరోలు లేకుండానే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్లు కొడతానని విజయశాంతి ప్రూవ్ చేసుకునేలా చేశాయి. 1993లో వచ్చిన పోలీస్ లాకప్ సినిమా తర్వాత రెండేళ్ల పాటు ఆమెకు సరైన హిట్లు లేవు. 1996లో ఆమె ఒక్క సినిమాలను నటించలేదు. అయితే 1997లో దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆమె నటించిన ఒసేయ్ రాములమ్మ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది.
1997 మార్చి 7న రిలీజ్ అయిన ఈ సినిమా రోజురోజుకు అంచనాలు మించిపోతూ టాలీవుడ్ లో అప్పటివరకు ఉన్న ఎన్నో రికార్డులకు పాతరేసింది. మహా మహా గొప్ప హీరోలుగా చెప్పుకునే హీరోలు క్రియేట్ చేసిన రికార్డులు సైతం ఒసేయ్ రాములమ్మ సినిమాతో విజయశాంతి బ్రేక్ చేసింది. ఆ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ – పవన్ కళ్యాణ్ తొలిప్రేమ – వెంకటేష్ ప్రేమించుకుందాం రా – నాగార్జున అన్నమయ్య సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
వీళ్ళు నలుగురు స్టార్ హీరోలే.. అయితే వీళ్లు నటించిన ఈ నాలుగు సినిమాలు కంటే కూడా విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మ సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అంటే.. ఈ సినిమా ఏ రేంజ్ లో అఖిలాంధ్ర ప్రేక్షకులను ఊపేసిందో తెలుస్తోంది. నలుగురు స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసి మరి విజయశాంతి సెన్సేషనల్ రికార్డు నమోదుచేసింది. ఈ రికార్డు టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయింది.