టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్గా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లాసికల్ హిట్‌గా నిలిచింది. ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ పలు సినిమాలకు ఓకే చెప్పారు. ముందుగా దిల్ రాజు బ్యానర్ లో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రానుంది.
విజయ్ దేవరకొండ ఎప్పుడు సామాజిక సేవలో ముందుంటారు.. సినిమాల ద్వారా వచ్చిన అమౌంట్ అటు వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టడంతో పాటు ఇటు సేవా కార్యక్రమాలకు కూడా బాగా వినియోగిస్తుంటారు. రీసెంట్గా కీడా కోలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన విజయ్ సందడి చేశాడు. ఇక కరోనా టైంలో విజయ్ దేవరకొండ చాలామందికి అండగా నిలిచారు. ఇటు సినీ ఇండస్ట్రీలో ఉన్న పేద కళాకారులకు సాయం చేయడంతో పాటు బయట ఇబ్బందులు పడుతున్న వారి వివరాలు కూడా తన దృష్టికి రాగా తనకు తోచినంత సహాయం చేశారు.
ఇక ఖుషి సినిమా టైంలో ఒక కోటి రూపాయలను తన బంధువుల్లో 100 కుటుంబాలకు లక్ష చొప్పున పంచి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ చేసిన మరో సాయం బయటకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోటబొమ్మాలి ప్రాంతంలో ఓ చిన్నారి రోడ్డు ప్రమాదంలో తన కాలును పోగొట్టుకుంది. ఈ విషయం విజయ్ దేవరకొండ దృష్టికి వచ్చింది.
ఆ పాప వివరాలు కనుక్కుని ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని ఆ చిన్నారి కుటుంబానికి అందించాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు అభిమానుల్లో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ పంపిన చెక్కును శ్రీకాకుళం జిల్లా అభిమాన సంఘాలతో పాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కలిసి ఆ పాప తల్లిదండ్రులకు అందజేశారు. ఆ పాప అడ్రస్ కనుక్కుని మరీ తన వంతుగా విజయ్ చేసిన ఈ సాయంకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.