Newsనానికి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఎక్క‌డ చెడింది.... వీరి గొడ‌వ‌కు కార‌ణం ఏంటి...

నానికి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఎక్క‌డ చెడింది…. వీరి గొడ‌వ‌కు కార‌ణం ఏంటి ?

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అయితే గత నాలుగైదేళ్లుగా నానికి మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండకు మధ్య వృత్తిపరమైన యుద్ధం తారా స్థాయిలో నడుస్తుందన్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. దీనిపై ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. అసలు వీరిద్దరికీ మధ్య నిజంగానే గొడవ జరిగిందా ? ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది అంటే దీని వెనక చాలా కారణాలు ఆసక్తికరమైన ప్రచారం నడుస్తోంది.

నాని హీరోగా 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ దేవరకొండ చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత హీరో అయిన విజయ్ దేవరకొండకు పట్టిందల్లా బంగారం అయింది. ఒకానొక దశలో పెళ్లిచూపులు – గీతగోవిందం – అర్జున్ రెడ్డి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత టాక్సీవాలా – డీయ‌ర్ కామ్రేడ్ – లైగర్ తాజాగా వచ్చిన ఖుషి సినిమాలు జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ మార్కెట్ స్టామినా ఏంటో చాటి చెప్పాయి.

మధ్యలో విజయ్ ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఒకానొక దశలో నాని మార్కెట్ ను కూడా విజయ్ మంచినీళ్లు తాగినంత సులువుగా దాటేశాడు. మామూలుగా చూస్తే విజయ్ సినిమాలో చిన్న రోల్ చేసిన విజయ్ దేవరకొండ నానిని మించి నటించడం వృత్తిపరమైన పోటీలో చూస్తే నాని వెనుక పడ్డాడా ? అనిపిస్తుంది. నానికి కూడా వరుస విజయాలు వస్తున్నాయి. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్నాడు. అయితే విజయ్ దేవరకొండ హిట్ సినిమాలు కు వచ్చిన వసూళ్లు నాని సినిమాలకు రావటం లేదు. నాని మార్కెట్ ఒకచోట ఆగిపోయినట్టుగా అనిపించింది.

అయితే దసరా సినిమాతో నాని కూడా రు. 100 కోట్ల వసూళ్లు కొలగొట్టి తన ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు రేసులో విజయ్ కాస్త వెనకబడినట్టుగా ఉంది. నాని దసరా సినిమా 100 కోట్లు కొల్లగొడితే విజయ్ నటించిన చివరి రెండు సినిమాలు లైగర్ డిజాస్టర్ అయింది.. ఖుషి సినిమాలో సమంత లాంటి క్రేజీ హీరోయిన్ ఉన్నా కూడా రు. 70 కోట్లు రావడం కష్టం అయిపోయింది. ఇలా సహజంగానే వీరిద్దరి మధ్య వృత్తిపరమైన పోటీని చూసినప్పుడు ఒక్కోసారి ఒక్కొక్కరు పై చేయి సాధిస్తూ వస్తున్నారు. ఇది సహజంగానే ఈ ఇద్దరు హీరోలను కంపేరిజన్ చేసి చూసినప్పుడు అభిమానుల మధ్య చీలిక‌లా వచ్చింది.

అందుకే నాని సినిమాలు రిలీజ్ అయినప్పుడు.. విజయ్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు జరుగుతున్న వ్యతిరేక ప్రచారం అంతా కావాలని చేస్తున్నారంటూ అపోహలు మొదలయ్యాయి. ఇక రెమ్యునరేషన్ పరంగా చూస్తే నాని నిన్న మొన్నటి వరకు 20 కోట్లు తీసుకునేవాడు. విజయ్ దేవరకొండ రేంజ్ 25 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు దసరా తర్వాత నాని నటిస్తున్న సినిమాలకు కూడా రెమ్యూనరేషన్ 25 కోట్ల రేంజ్ లో ముడుతోందని తెలుస్తోంది. ఇలా సినిమాల కలెక్షన్ల నుంచి రెమ్యూనరేషన్ వరకు నాని, విజయ్ దేవరకొండ పోటాపోటీగా ముందుకు వెళుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news