టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉంటారు. తన పని తాను చేసుకుపోతారు. ఇన్నేళ్ల తన కెరీర్లో వెంకటేష్ ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. హీరోయిన్లతో ఆయన చాలా స్నేహంగా ఉంటారు. హీరోయిన్లకు వెంకటేష్ కి మధ్య లింకులు ఉన్నట్టు ఎప్పుడూ ప్రచారాలు జరగలేదు. పుకార్లు పెద్దగా లేవు. వెంకటేష్ హీరోయిన్ల విషయంలో ఎంత సఖ్యతతో ఉన్నా కూడా నలుగురు హీరోయిన్ల విషయంలో మాత్రం ఆయనపై కొన్ని వివాదాలు వచ్చాయి.
ఈ నలుగురు హీరోయిన్లతో కొన్ని విషయాలలో ఆయనకు గొడవలు వచ్చాయని.. ఈ హీరోయిన్లలో కొందరితో ఇప్పటికీ వెంకటేష్ కు మాటలు లేవని అంటారు. ఆ హీరోయిన్లు ఎవరో ? చూద్దాం. వెంకటేష్ రోజా కాంబినేషన్లో పోకిరి రాజా సినిమా తెరకెక్కింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత ఓ తమిళ సినిమా రీమేక్ చేస్తున్నప్పుడు అక్కడ నటించిన రోజానే తెలుగులో వెంకటేష్ పక్కన హీరోయిన్గా తీసుకోవాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఆ టైంలో సౌందర్య, వెంకటేష్ జోడి మార్కెట్ బాగుంది.
నిర్మాతలు రోజాకు బదులుగా చివరలో సౌందర్యను తెర మీదకు తెచ్చారు. వెంకటేష్ కావాలనే తనను తప్పించి సౌందర్యను తన పక్కన హీరోయిన్గా తీసుకున్నారని రోజా ఫిక్స్ అయింది. రోజా పొరపాటున అపోహ పడ్డారని ఈ విషయంలో వెంకటేష్ తప్పేమీ లేదని కూడా అంటారు. ఏది ఏమైనా రోజా అప్పటినుంచి ఇప్పటివరకు వెంకటేష్‌తో మాట్లాడటం లేదని.. ఆ సంఘటన వీరిద్దరి మధ్య గ్యాప్ పెంచిందన్న ప్రచారం ఉంది.
ఇక వెంకటేష్ తో మళ్లీశ్వరి సినిమా టైంలో నటించిన కత్రినా కైఫ్ షూటింగ్ సగం పూర్తయ్యాక తనకు ఎక్కువ రెమ్యునరేషన్ కావాలని పట్టు పట్టారు. అలా వారిద్దరి మధ్య కూడా గొడవలు జరిగాయి. కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు కత్రినా, వెంకటేష్ కు సరిగా కోపరేట్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగిందంటారు. ఇక మరో హీరోయిన్ నిత్యమీనన్ ఒక సినిమాలో వెంకటేష్ పక్కన హీరోయిన్గా నటించాల్సి వచ్చింది. అయితే నిత్య అంకుల్ పక్కన నేను హీరోయిన్ గా నటించడం ఏంటని ఓపెన్‌గా చెప్పడంతో వెంకీ బాగా ఫీలయ్యారన్న ప్రచారం ఇండస్ట్రీలో జరిగింది.
ఇక మరో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. రమ్యకృష్ణ , వెంకటేష్ కాంబినేషన్లో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. ఒక షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య స్వల్ప వివాదం జరిగిందని అయితే ఆ తర్వాత వీరిద్దరూ అవన్నీ మర్చిపోయి ఇప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటారని అంటారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఇగోలు, పంతాలు, పట్టింపులు ఇవన్నీ కామన్ గా నడుస్తూ ఉంటాయి.