మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజలు మొదలయ్యాయి. సొట్ట చెంపల హీరోయిన్ లావణ్య త్రిపాఠి – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూడుముళ్ల బంధంతో ఒకటయ్య సమయం రానే వచ్చేసింది. ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉండి ఇప్పుడు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు ఏడడుగులు వేయబోతున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఓవైపు పెళ్లి పనులు జరుగుతుండగా ఇటీవల లావణ్య – వరుణ్ ఫ్రీ వెడ్డింగ్ పార్టీ కూడా ఎంతో వైభవంగా నిర్వహించారు. ఇదంతా పక్కన పెడితే వీరి పెళ్లి బాధ్యతలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. పెళ్ళికి గెస్ట్లుగా ఎవరెవరిని ? పిలవాలి పెళ్లికి వాడే మొత్తం కాస్ట్యూమ్స్ అన్ని ఉపాసన కనుసనల్లోనే నడుస్తున్నాయట.
ఉపాసనకు మామూలుగానే ఫ్యాషన్‌లో ఒక యూనిక్ టేస్ట్ ఉంది.. అలాగే ఇంటీరియర్ విషయంలో కూడా ఆమె టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ఆమె వేసుకునే డ్రెస్సులలో కూడా మంచి లుక్ కనబడుతూ ఉంటుంది. ఈ క్రమంలో వరుణ్ – లావణ్య పెళ్లి బట్టల విషయంలో కూడా ఉపాసన టేస్ట్ మేరకే సెలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే అతిధులుగా ఎవరెవరిని పిలవాలి ? పెళ్లి దగ్గర ఎలాంటి ఇంటీరియర్ ఉండాలి అన్నది ? మొత్తం ఉపాసన ఓకే చేసిన వాటిని ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పనుల్లో ఆమెకు సాయంగా వరుణ్‌తేజ్ తల్లితో పాటు వరుణ్ చెల్లి నిహారిక ఉంటున్నారట.