ఎస్ ప్రెసెంట్ ..ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ మెగా ప్రిన్స్‌గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ త్వరలోనే లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. కాగా నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో వీళ్ల పెళ్లి గ్రాండ్‌గా జరగబోతుంది . పెళ్లికి నాలుగు రోజుల ముందే మెగా – అల్లు – లావణ్య కుటుంబం ఇటలీ చేరుకోబోతోంది .
ఇలాంటి క్రమంలోనే వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఇటలీకి ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్లే విధంగానే ప్లాన్ చేసుకున్నారట. కానీ లావణ్య సలహా మేరకు ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అంటూ చెప్పడంతో.. వరుణ్ తన సొంత ఖర్చులతో లావణ్య – అల్లు – మెగా కుటుంబంలోని అందరి సభ్యులను తన సొంత ఖర్చులతోనే ఇటలీ తీసుకొని వెళ్లి.. మళ్లీ ఇండియా తీసుకొచ్చే వరకు కూడా ప్రతి ఒక్క రూపాయి వరుణ్ తేజ్ భరించాలని డిసైడ్ అయ్యారట.
అయితే నిహారిక పెళ్లి విషయంలో మాత్రం ఇలా జరగలేదు.. ఎవరి ఖర్చులు వాళ్లే పెట్టుకున్నారు . కానీ వరుణ్ మాత్రం తన పెళ్లికి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని.. నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ..ఆ సాటిస్ఫాక్షన్ నాకు లావణ్యకి ఇద్దరికీ ఉంటుందని భావించి ..ఈ కాబోయే కొత్తజంట ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!