Moviesవరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. క్రేజీ కపుల్ మిస్సింగ్ ..కొత్త...

వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. క్రేజీ కపుల్ మిస్సింగ్ ..కొత్త డౌట్లు పుట్టిస్తున్న తాజా పిక్స్..!!

గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో మెగా ఫ్యామిలీ .. మెగా హీరోల కుటుంబ సభ్యులు అంతా కలిసి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తాజాగా వరుణ్ లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోస్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు . ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతున్నాయి . అభిమానులు ఈ ఫోటో కింద కామెంట్స్ పెడుతూ వస్తున్నారు .

కాగా వరుణ్ తేజ్ లావణ్య తమ ప్రేమ విషయాన్ని ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా దాచేశారు. ఫైనల్లి పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్నారు . ఈ క్రమంలోనే నవంబర్లో వీరి పెళ్లి ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ జంట .

ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి చరణ్, ఉపాసన ,వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ,అల్లు శిరీష్ మెగా ఫ్యామిలీ ,లావణ్య ఫ్యామిలీ .అల్లు ఫ్యామిలీలు అటెండ్ అయ్యాయి. ఈ ఫోటో చూడడానికి చాలా చాలా పాజిటివ్ వైబ్స్ ని. క్రియేట్ చేసేలా ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు ఈ ఫోటోలో అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి లేకపోవడం కూసింత వెలితీగా ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news