మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి రీసెంట్ గానే కూతురు పుట్టింది. ఆమె పేరు క్లింకార. ప్రజెంట్ ఉపాసన క్లింకార – చరణ్ – ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఉపాసన చరణ్ కు దొరకడం చాలా చాలా అదృష్టం అంటూ పలువురు ఫాన్స్ కామెంట్స్ చూస్తుండగా.. ఉపాసన చరణ్ కోసం చేసిన బిగ్ శాక్రిఫైజ్ వైరల్ అవుతుంది. ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటిని వదిలి అత్తింటికి రావాలి అంటే చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది.
అది ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే ప్రాబ్లమే అయితే చిన్నప్పటినుంచి ఉపాసన పెళ్లి అయితే నేను అత్తగారింటికి వెళ్ళను .. ఇక్కడే ఉంటాను మమ్మీ డాడీని చూసుకుంటాను అంటూ చాలా చాలా బలంగా చెప్పుకొచ్చేదట . అంతేకాదు రామ్ చరణ్ తో ప్రేమ మొదలైన తర్వాత కూడా అలాగే చెప్పుకొచ్చేదట. అయితే అవంతా కామన్ గా చెప్పే ఆడపిల్లలు డైలాగ్స్ ఏ కదా అంటూ లైట్ తీసుకున్నారట చరణ్ . అయితే ఉపాసన గురించి చరణ్ ఇంట్లో చెప్పిన మూమెంట్లో కూడా ఉపాసన ..నేను అత్తగారింటికి రాను మా ఇంట్లోనే ఉంటాను అంటూ బాగా మొండి చేసిందట .
అయితే వాళ్ళ అమ్మగారు శోభా ఆమెకు అర్థమయ్యే భాషలో చెప్పి ఉపాసనని కాంప్రమైజ్ చేయించి మరి అత్తగారింటికి పంపించిందట. ఇలా మొదటి నుంచి తాను అనుకున్న విషయాన్ని లాస్ట్ మూమెంట్లో మార్చేసుకొని చరణ్ కోసం తల్లిదండ్రులను వదిలి అత్తగారింటికి రావడానికి బిగ్ శాక్రిఫైజ్ చేసింది ఉపాసన. ప్రతి ఆడపిల్లకి కూడా ఇది టఫ్ సిచువేషన్ అని చెప్పాలి..!