MoviesBigg Boss7: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఊహించని కంటెస్టెంట్.. ఇది...

Bigg Boss7: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఊహించని కంటెస్టెంట్.. ఇది నిజమైన ఉల్టా-పల్టా అంటే..!

వామ్మో ..ఏంటిది నాగార్జున ఏ ముహూర్తాన ఇది ఉల్టా పల్టా షో అని చెప్పాడో తెలియదు కానీ నిజంగానే ఇది ఉల్టా పల్టా షో అని చెప్పడం కరెక్ట్ అన్న కామెంట్స్ జనాలు ఎక్కువగా చేస్తున్నారు . అసలు ఈ సీజన్లో ఏం నడుస్తుంది ..? ఎలా నడుస్తుంది..? ఎందుకు నడుస్తుంది..? తెలియకుండా ముందుకెళ్ళిపోతుంది. ఏ కంటెస్టెంట్ ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడు ..? ఎవరు ఎప్పుడు హౌస్ లోకి వస్తారు..? ఎవరు ఎలాంటి టాస్కులు ఆడతారు ..? అస్సలు అర్థం కాని పరిస్థితి నెలకొనింది.

గత సీజన్స్ బిగ్ బాస్ కి ఈ సీజన్ బిగ్ బాస్ కి చాలా చాలా తేడా ఉంది. గత సీజన్ బిగ్ బాస్ రూల్స్ ని పెట్టి బ్రేక్ చేయడు. కానీ ఈ సీజన్ బిగ్ బాస్ రూల్స్ తాను పెట్టిన రూల్స్ తానే బ్రేక్ చేసి తనకి ఇష్టం వచ్చిన కంటెస్టెంట్ ని ఇంట్లో ఉంచుకుంటున్నాడు. ఇష్టం లేని కంటెస్టెంట్ ని బయటకు దొబ్బేస్తున్నాడు. అంతేకాదు మళ్లీ ఆ కంటెంట్ కావాలి అంటే ఇంట్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పిస్తున్నాడు.

రీసెంట్గా ఇలాంటి ఓ న్యూస్ వైరల్ గా మారింది . హౌస్ లోకి రతిక వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న వార్త వైరల్ అయింది . ఆమె హౌస్ లో నడిపిన డబల్ గేమ్స్ .. డబల్ ట్రాక్స్ భరించలేని జనాలు .. ఆమెకు తక్కువ ఓట్లు వేసి ఎలిమినేట్ చేయించారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ చాలామంది రతిక హౌస్ లో ఉండాలి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం.. ఆమె పేరుని ఎక్కువగా ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో బిగ్ బాస్ అయితే మనసు మార్చుకొని ఆమెనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించబోతున్నారట. దీంతో హౌస్ లో ఇక రచ్చ రంబోలా క్రియేట్ అవ్వడం కన్ఫామ్ అంటున్నారు. మరీ ముఖ్యంగా రైతు బిడ్డకి రతికకి మధ్య ఇక ఎలాంటి వార్ నడుస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్న అర్థం గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news