తమిళ హీరో అయినా సిద్ధార్థ కు తెలుగులో తిరిగులేని క్రేజ్ ఉంది. తెలుగులో ఒకానొక టైంలో తెలుగు హీరోలా వరుసగా సినిమాలు చేసి సూపర్ హిట్ లు కొట్టాడు. బొమ్మరిల్లు సినిమా తర్వాత తెలుగులో సిద్ధార్థ్ క్రేజ్ మామూలుగా లేదు. ఇక సిద్ధార్థ్‌కు ముందు నుంచి ముక్కు సూటిగా మాట్లాడే హీరోగా పేరు ఉంది. గత పది ఏళ్లలో తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.. మహాసముద్రం ఎన్నో అంచనాలతో చేసినా.. ఎన్నో ఆశలు పెట్టుకున్నా అది ఫెయిల్ అయింది.
ఇది ఇలా ఉంటే సిద్ధార్థ్‌ను తెలుగు ఇండస్ట్రీ కావాలనే తొక్కేసింది అన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. అందుకే గత 10 ఏళ్లలో 3 – 4 సినిమాలకు మించి చేయలేదని అంటారు. ఈ ప్రచారంపై సిద్ధార్థ్ ఘాటుగా స్పందించాడు. తనను తొక్కేయటానికి వాళ్ళు ఎవరని ? తొక్కించుకోవడానికి తాను ఎవరి ? కాళ్ళ కింద లేనని అయితే టాలీవుడ్ లో కొంతమంది తనను గౌరవించలేదని.. ఆదరించలేదని విమర్శలు మాత్రం చేశాడు.
చిన్నా సినిమా తీసిన తర్వాత తెలుగులో రిలీజ్ కోసం కొంతమంది నిర్మాతలను సంప్రదించాడట సిద్ధార్థ్. ఒక నిర్మాత కావాలని సిద్ధార్థ్‌ను గేటు బయట నిలబెట్టాడట. ఆ నిర్మాత లోపల ఉండి కూడా సిద్ధార్థ్ ను చాలా సేపు బయట వెయిట్ చేయించాడట. మరో నిర్మాత అయితే సిద్ధార్థ్ సినిమాలని ఈ కాలంలో ఎవరు చూస్తారని ? ఎద్దేవా చేశాడట. ఇలాంటి ఘటనలు తనను బాగా డిస్టర్బ్ చేశాయని సిద్ధార్థ్ వాపోయాడు. చిన్నా సినిమాను తన కంబ్యాక్ మూవీ గా చెప్పటానికి ఇష్టపడటం లేదు.
సిద్ధార్థ్ టాలీవుడ్ నుంచి బయటకు వెళ్ళిపోతే కంబ్యాక్ అనాలని.. తాను ఎప్పుడూ టాలీవుడ్ లోనే ఉన్నానని తనతో సినిమాలు తీయకపోతే తనే సినిమాలు తీసుకుంటానని కూడా అన్నాడు. ఇక చిన్నా సినిమాతో ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సిద్ధార్థ్ తన జీవితంలో ఇంతకన్నా బెటర్ సినిమా తీయలేనని చెప్పాడు. మరి సిద్ధార్థ్ తనను ఇద్దరు నిర్మాతలు అవమానించారు అని చెప్పినా.. ఆ నిర్మాతల పేరు మాత్రం చెప్పలేదు. వీళ్లలో సిద్ధార్థ్‌తో సూపర్ హిట్ సినిమాలు తీసిన నిర్మాత కూడా ఉన్నట్టు టాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.