ఎందుకూ పనికిరాని హీరోయిన్ అని స్టార్ గా ఓ వెలుగు వెలిగిన బాలీవిడ్ బ్యూటీ కత్రినా కైఫ్ అనిపించుకున్న మాటలివి. కెరీర్ ప్రారంభంలో కత్రినా కైఫ్ తెలుగులో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమానే మల్లీశ్వరి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి సురేష్ బాబు నిర్మించగా ఆయన సోదరుడు టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది. అయితే, అప్పట్లో ఒక డెబ్యూ హీరోయిన్ కి మహా అయితే మూడు నుంచి 5 లక్షలు ఇచ్చేవారు.
మరీ ఎక్కువ అనుకుంటే 10 లక్షలు ఇచ్చేవారు. కానీ, కత్రినాకి దాదాపు 1 కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారట. ముందు మాట్లాడిన రెమ్యునరేషన్ కంటే రెట్టింపు సినిమా మొదలయ్యాక కత్రినా డిమాండ్ చేసిందని మధ్యలో చేసేదేమీ లేక నిర్మాత సురేష్ బాబు అన్నీ సౌకర్యాలతో పాటు 1 కోటి వరకూ రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ విషయంలోనే సురేష్ బాబుపై ఆయన తండ్రి, అగ్ర నిర్మాత రామానాయుడు, వెంకటేష్ కలిసి గొడవ పడ్డారట.
10 లక్షలు ఇవ్వడమే కొత్త హీరోయిన్ కి ఎక్కువ అనుకుంటే నువ్వు 1 కోటి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ముగ్గురి మధ్య గట్టి వాదన జరిగిందట. అయితే, మల్లీశ్వరి రిలీజయ్యాక మంచి వసూళ్ళు రాబట్టడంతో కత్రినాకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఓకే అనుకున్నారట. ఎందుకంటే మల్లీశ్వరి రిలీజయ్యాక ఎక్కువ శాతం భారీ కటౌట్ లా ఉన్న కత్రినాను చూసేందుకే వెళ్ళారు. సినిమాకి అప్పుడు కత్రినానే హైలెట్ అయింది.
కాబట్టే రిలీజ్ కి ముందు రామానాయుడు, వెంకటేష్ ..సురేష్ బాబుపై నానా గొడవ చేసినా తర్వాత మాత్రం సురెష్ బాబు కత్రినాని హీరోయిన్‌గా ఫైనల్ చేయడంలో అధికంగా రెమ్యునరేషన్ ఇవ్వడంలో తీసుకున్న డెసిషన్ కరెక్టే అని కాంప్రమైజ్ అయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఈ పొడుగు కాళ్ళ సుందరి ఒకటీ రెండు సినిమాతో సరిపెట్టుకున్నా బాలీవుడ్ లో మాత్రం హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చెరుకుంది. కేవలం ఐటెం సాంగ్ కోసమే మూడు నుంచి నాలుగు కోట్లు తీసుకున్న రోజులు ఉన్నాయంటే కత్రినా క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.