Moviesఇప్పటివరకు నమ్రతకు అలాంటి గిఫ్ట్ ఇవ్వని మహేశ్..ఎందుకో తెలుసా..? మొగుడు ఆలోచనలు...

ఇప్పటివరకు నమ్రతకు అలాంటి గిఫ్ట్ ఇవ్వని మహేశ్..ఎందుకో తెలుసా..? మొగుడు ఆలోచనలు కూడా ఇలా ఉంటాయా..?

మహేష్ బాబు ఆరడుగుల అందగాడు ..పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ చూడడానికి కుర్రాడిలానే ఉంటాడు . తన కొడుకును మహేష్ బాబును పక్కన పెడితే తండ్రి కొడుకులు అనడం కన్నా అన్న తమ్ముడులా ఉంటారు జనాలు. అలాంటి యంగ్ లుక్స్ ని మైంటైన్ చేస్తున్నాడు మహేష్ బాబు. కాగా ఎప్పుడు సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉండే మహేష్ బాబు రీసెంట్ గా పర్సనల్ ఈవెంట్ కు అటెండ్ అయ్యాడు .

గౌరీ సిగ్నేచర్ అనే షో రూమ్ ని ఓపెన్ చేశారు. దీంతో మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం ఇచ్చాడు . జూబ్లీహిల్స్ లోని తమ స్నేహితుల డిజైనర్ షాప్ ఓపెనింగ్ చేయడానికి మహేష్ -నమ్రత ఇద్దరు జంటగా వచ్చారు . ఇప్పటివరకు ఈ ఇద్దరు వేరు వేరుగానే ఓపెనింగ్ ఈవెంట్స్ కి వచ్చేవారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరు కలిసి జంటగా కనిపించడంతో అభిమానులు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు .

ఇదే క్రమంలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు నమ్రత మహేష్ చాలా ఓపికగా సమాధానం చెప్పారు . “మీరు ఎప్పుడైనా నమ్రత మేడంకు ఏమైనా బట్టలు కొన్నారా..? అని ఓ రిపోర్టర్ అడగ్గా..” ప్రామిస్ నమ్మండి ..నేను ఇప్పటివరకు నమ్రతకు బట్టలు కొనివ్వలేదు ..ఏది కొనివ్వలేదు ..ఎందుకంటే నాకు సెలక్షన్ పెద్దగా రాదు ..నిజం చెప్పాలంటే నా బట్టలు కూడా తనే షాపింగ్ చేస్తుంది ..ఇక ఈ షాప్ ఓపెనింగ్ కు నేను కేవలం ఫ్రెండ్ కోసమే వచ్చాను ..ఇది నా బ్రాండ్స్ లో లేదు” అని చెప్పుకొచ్చాడు . దీంతో ఆయన మాటలు వైరల్ గా మారాయి. అయితే కొందరు అమ్మాయిలు భర్తల ఆలోచనలు ఇలా ఉంటాయా..? అంటూ ఫనీ కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news