మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా స్టువర్ట్‌పురంలో పేరు మోసిన గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తేజ్ నారాయణ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ – గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు.
రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచేసింది. దీనికి తోడు సౌత్ తో పాటు నార్త్‌లో కూడా ప్రమోషన్లు గ్రాండ్గా నిర్వహించడంతో టైగర్ నాగేశ్వరరావుపై హైప్ మామూలుగా లేదు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ తో పాటు పలుచోట్ల ఫస్ట్ షో పడిపోయింది. ప్రీమియర్ షో టాక్ ప్రకారం ఈ సినిమాకు ట్విట్టర్లో పర్వాలేదు అనే స్పందన లభిస్తోంది.
డార్క్ క్యారెక్టర్ లో రవితేజ యాక్షన్ హైలెట్ అని అంటున్నారు. సినిమాలో యాక్షన్ అదిరిపోయింది అని.. చెబుతున్నారు. చాలామంది ట్రైన్ సీక్వెన్స్ గురించి చర్చించుకుంటున్నారు. అయితే రన్ టైం చాలా ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. 182 నిమిషాల పాటు సినిమా చూడటం చాలా ఇబ్బందిగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. సినిమాలో లవ్ ట్రాక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదని.. సినిమాలో యాక్షన్ డ్రామా బాగున్నా రన్ టైం బాగా ఎక్కువగా ఉండటం.. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ సాగదీసినట్టుగా ఉండటం సినిమా చూసే ఆడియన్స్ కు కాస్త ఇబ్బందిగా ఉందంటున్నారు.
సినిమాలో క్యారెక్టర్లను తీర్చిదిద్దిన విధానం బాగుందని.. ఇటీవల కాలంలో రవితేజ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇది అని చెబుతున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు అదిరిపోయాయని మరో నెటిజన్ చెబుతున్నాడు. అయితే సినిమా రన్ టైం ఎక్కువగా ఉండటం మాత్రం మైనస్ అంటున్నారు. ఓవరాల్ గా సినిమాకు పరవాలేదు అన్న టాక్ వస్తుంది. కొద్ది సేపట్లో పూర్తి రివ్యూ తో టైగర్ నాగేశ్వరరావు భవితవ్యం ఏంటో ?తేలిపోనుంది.