మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక సరైన కథలు.. సరైన దర్శకులను ఎంచుకోవడంలో తప్పటడుగులు వేస్తున్నారు. చిరంజీవి బంధుత్వాల పరంగాను.. సామాజిక సమీకరణలపరంగా కూడా కొంతమంది దర్శకులకు మొహమాటానికి పోయి అవకాశాలు ఇస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అలా ఛాన్సులు ఇచ్చిన సినిమాలు అన్నీ మిస్‌ఫైర్ అవుతున్నాయి. వివి వినాయక్, బాబి,మెహర్ రమేష్ వీళ్లు సామాజిక సమీకరణల పరంగాను, బంధుత్వ పరంగాను చిరంజీవికి సన్నిహితులే.
మెహర్ రమేష్ లాంటి వాళ్ళతో బంధుత్వం కూడా ఉంది. ఈ కోణంలోనే మారుతి, కురసాల కళ్యాణ్‌కృష్ణకి కూడా ఆయన ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చారట. ఎప్పుడు అయితే చిరంజీవి నటించిన సినిమాలు వరుస పెట్టి డిజాస్టర్లు అవుతున్నాయో ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. ఇప్పుడే దాని నుంచి బయటికి వచ్చారు.. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు.. వాళ్ళ అభిరుచికి అనుగుణంగా సినిమాలు చేయకపోతే జనాలు త్వరగానే మనమల్ని మరిచిపోతారన్న విషయాన్ని ఆయన గ్రహించారు.
అందుకే తన కుమార్తె నిర్మాణ సారథ్యంలో కురసాల కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ఆయన చేయాల్సిన సినిమాను పక్కన పెట్టేసి మరి బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట తో సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఏకంగా రు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే మారుతికి తన హామీ ఇచ్చిన ఆ సినిమాను పక్కన పెట్టేశారు. అలాగే కళ్యాణ్ కృష్ణ కూడా చిరంజీవి లైన్ అఫ్ నుంచి సైడ్ అయిపోయాడు.
అప్పటి వరకు సామాజిక, బంధుత్వ కోణంలో డైరెక్టర్లకు ఛాన్సులు ఇచ్చిన చిరంజీవి ఘోరమైన ఎదురు దెబ్బల తర్వాత చివరకు తన సొంత కుమార్తె సుస్మితకు కూడా షాక్ ఇచ్చేశారు. ఆమె బ్యానర్లో చేయాల్సిన సినిమాను కూడా వదిలేశారు. ఇటీవల కూడా పూరి జగన్నాథ్ తనకు మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తూ వచ్చారు.. అసలు ఇప్పటిలో పూరి జగన్నాథ్ కు చిరంజీవి అపాయింట్మెంట్ కూడా ఇస్తారంటే నమ్మలేని పరిస్థితి. అలా చిరంజీవితో సినిమా కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ముగ్గురు దర్శకుల ఆశలు అడియాసలు అయిపోయాయి.