Newsబాల‌య్య నుంచి సోషియా ఫాంట‌సీ సినిమా టైటిల్ ఇదే...!

బాల‌య్య నుంచి సోషియా ఫాంట‌సీ సినిమా టైటిల్ ఇదే…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్. సింహ, లెజెండ్, అఖండ ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. అఖండ 2 లో అఘోర పాత్రతో కూడా బాలయ్య నట విశ్వరూపం చూపించేశాడు. అఖండ సినిమా సూపర్ హిట్ అయ్యాక బోయపాటి తాజాగా రామ్‌తో స్కంద సినిమా తెరకెక్కించారు.

ఈ సినిమా కూడా మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 రాబోతున్నట్టు బోయపాటి ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. బాలయ్యతో బోయపాటి చేస్తున్న కథలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయట. మెయిన్ కథ చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో అఖండలాంటి సినిమా రాబోతుందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో బోయపాటి మార్క్‌ యాక్షన్ సీన్లు, పొలిటికల్ పంచ్‌లు ఫుల్లుగా ఉంటాయట. ఇక ఈ సినిమాకు అఖండ 2 అని టైటిల్ పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య దర్శకుడు.. బాబి కలయికలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఆ తర్వాత బాలయ్య – బోయపాటి అఖండ 2 సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news