సాధారణంగా.. హీరో అయినా.. హీరోయిన్ అయినా.. తమకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాల్లో నటించేందుకు ఒప్పుకొంటారు. తమకు ప్రాధాన్యం లేకపోతే. చూద్దాం.. చేద్దాం.. అంటూ కాలం గడిపేస్తారు. అంతేకా దు.. ఒక్కొక్కసారి సినిమాలకు చేయం అని కూడా చెప్పేస్తారు. ఎంతైనా హీరో పాత్రకు ఉండే ప్రాధాన్యం అలాంటిదే కాబట్టి.. దర్శకులు, నిర్మాతలు కూడా జాగ్రత్తలు తీసుకునేవారు.
అయితే.. తొలినాళ్లలో కొంత ప్రాధాన్యం ఉన్న సినిమాలే అన్నగారు చేశారు. తర్వాత.. హీరో ఓరియెంటెడ్ కథలను ఎంచుకున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో అప్పటి అగ్రనటుడు గోవింద రాజుల సుబ్బారావు చుట్టూ కథలు తిరిగేలా దర్శకులు సినిమాలు చేసేవారు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగాఎంతో పేరు తెచ్చుకు న్నారు. పైగా.. ఆయన వైద్యులు కూడా. ఇలా.. వచ్చిన సినిమానే .. షావుకారు. ఈ సినిమాతోనే జానకి, ఎస్వీ. రంగారావు వంటివారు పరిచయం అయ్యారు.
తర్వాత మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక, ఈ సినిమాలో హీరో వేషధారి .. ఎన్టీఆర్. ఈయన షావుకారు (గోవింద రాజుల సుబ్బారావు) కుమారుడిగా నటించారు. సినిమా ప్రధాన కథతో ఈయనకు సంబంధం ఉండదు. మెజారిటీ కథ అంతా కూడా.. గోవింద రాజుల సుబ్బారావు చుట్టూ తిరుగుతుంది. పైగా సినిమా పేరు కూడా షావుకారు. దీంతో తొలుత ఈ సినిమాను అక్కినేనితో చేయించాలని అనుకున్నా..ఆయన కథలో హీరోకు సరైన రోల్ లేదని చెప్పి తప్పుకొన్నారు.
కానీ, అన్నగారు.. మాత్రం ఓకే చెప్పారు. దీనికి కారణం.. సుబ్బారావే. ఆయన అడిగే సరికి అన్నగారు కాదనలేక పోయారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే.. పేరు మాత్రం అన్నగారికి రాకపోయినా.. ఆయన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.