Moviesరియా పై సడెన్ గా సమంత అంత ప్రేమలు వలకబోయడానికి కారణం...

రియా పై సడెన్ గా సమంత అంత ప్రేమలు వలకబోయడానికి కారణం ఇదేనా..? మహా జాదునే..!!

రియా చక్రవర్తి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . బాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ గా అందరికీ సుపరిచితురాలు . అయితే సుశాంత్ సింగ్ సూసైడ్ తర్వాత రియా చక్రవర్తి ఎలా చిక్కుల్లో ఇరుక్కునిందో మనకు తెలిసిందే. సుశాంత్ సింగ్ మరణానికి కారణం రియా చక్రవర్తి అని సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపించడంతో .. పోలీసులు రంగంలోకి దిగి ఆమెను విచారించారు .

సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిందన్న ఆరోపణలపై సుమారు 6 వారాలపాటు రియా చక్రవర్తి జైల్లో ఉన్నారు . ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె మీడియాకి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. రీసెంట్గా ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న రియా చక్రవర్తి తన లైఫ్లో ఎదుర్కొన్న కష్టాలపై ఓపెన్ అప్ అయినట్లు తెలుస్తుంది . “నా బలం బలహీనత అంతా నా ఫ్యామిలీనే.. నా కష్టంలో నా ఫ్యామిలీ నాకు ఎంతో సపోర్ట్ చేసింది . నేను ఆర్మీ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను ..అందుకే నాకు అంత ధైర్యం. తప్పు చేయనంత వరకు భయపడాల్సిన ప్రసక్తే లేదు . ఎంత ప్రాబ్లం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి ..అప్పుడే మనం ఏంటో మనకి తెలుస్తుంది . పక్కవాళ్ళకి తెలుస్తుంది “.

“నేను కూడా అదే చేశాను .. నా విషయంలో నా కుటుంబం ఎంతో ఎంతో సపోర్ట్ ఇచ్చింది. మా మమ్మీ , డాడీ నే కాదు నా బ్రదర్ నా ఫ్రెండ్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది “. అంతేకాదు మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మనల్ని నమ్మి సపోర్ట్ చేసే మనిషి మన వెనక నిలబడి మనకు సపోర్ట్ చేస్తే అదే చాలు అంటూ చెప్పుకొచ్చింది . దీనితో రియాచక్రవర్తి మాట్లాడుతున్న వీడియో క్లిప్ ని స్టార్ హీరోయిన్ సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అంతేకాదు రియా చక్రవర్తిని హీరో అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. అసలు రియాకు సమంతకు ఏంటి సంబంధం ..? ఆమె ఎవరి గురించో మాట్లాడితే సమంత ఎందుకు అలా క్యాప్షన్ పెట్టింది..? సమంతకు రియా మాటలు అంత నచ్చాయా ..? అంటుంటే కొందరు చైతన్య గురించి పరోక్షంగా కామెంట్ పెట్టింది అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news