సినీరంగంలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్ లేదా ఫ్లాప్ కొట్టడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. అలాగే విక్టరీ వెంకటేష్ చేయాల్సిన ఓ మంచి సినిమా మిస్ కావడంతో అది కాస్తా మెగాస్టార్ చిరంజీవి చేశారు. చిరంజీవి సోదరుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగబాబు నటుడుగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారి తన అంజనా ప్రొడక్షన్స్ పై ఎన్నో సినిమాలు కూడా నిర్మించారు.
పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్, రామ్ చరణ్ తో ఆరెంజ్, చిరంజీవితో బావగారు బాగున్నారా, స్టాలిన్, బన్నీతో నా పేరు సూర్య వంటి సినిమాలు నిర్మించారు. ఇప్పటివరకు నాగబాబు కేవలం మెగా ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ అప్పట్లో ఆయన విక్టరీ వెంకటేష్ తో కూడా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశారు. ఆ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ సినిమా ఏదో కాదు ప్రఖ్యాత దర్శకుడు కే బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన రుద్రవీణ.
ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే చాలా స్పెషల్ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ చిరంజీవికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది. ఈ సినిమాకు నాగబాబు నిర్మాత.. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా అప్పట్లో ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అయితే ఈ సినిమాను ముందు వెంకటేష్ తో చేయాలని నాగబాబు అనుకున్నారు. ఇలాంటి కథలు వెంకటేష్ చేస్తేనే జనాలు బాగా చూస్తారు అన్నది నాగబాబు ప్లాన్.
అయితే ఈ కథను విన్న చిరంజీవి నాకు ఎంతో నచ్చింది.. ఈ సినిమా నేనే చేస్తాను.. నువ్వు వెంకటేష్ తో మరో సినిమా చేయి అనడంతో చివరకు తన కోరిక మేరకు ఆయనతోనే ఈ సినిమా నిర్మించారు. దీంతోపాటు బాలచందర్ దర్శకత్వంలో ఒక్క సినిమాలో అయినా నటించాలన్నది చిరంజీవి ఆకాంక్ష. చిరంజీవి ఎంతో ఇష్టంతో రుద్రవీణ సినిమా చేసిన కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా.. చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే మంచి సినిమాగా మిగిలిపోయింది.