రేణు దేశాయ్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమెకు ఎలాంటి ? పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత మహారాష్ట్రలో పూణేలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. ఆ తర్వాత తెలుగులో బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా చేసిన రేణు దేశాయ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్రలో కనిపించనుంది. చాలా రోజుల తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపిస్తుండడంతో ఈ పాత్ర ఎలా ? ఉండబోతుంది అన్న అంచనాలు గట్టిగా ఉన్నాయి. రేణు దేశాయ్ తెలుగులో చేసింది రెండు సినిమాలే.. ముందుగా ఆమె పవన్ కళ్యాణ్ కి జోడిగా బద్రి సినిమాలో నటించింది. హీరోయిన్గా ఆమెకు ఇదే తొలి సినిమా.. ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు ఆమె ఒక్క సినిమా కూడా చేయలేదు.
2003లో మళ్ళీ పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాలను ఆమె హీరోయిన్గా నటించింది. అయితే రేణు దేశాయ్ మధ్యలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడిగా ఒక సినిమాలో నటించాల్సి ఉంది. అది సూపర్ హిట్ సినిమా కావటం.. అది రేణు వదులుకోవటం జరిగిపోయాయి. ఆ సినిమా ఏదో కాదు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి.
2001లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా సోనాలి బింద్రే నటించింది. ముందుగా హీరోయిన్ రోల్ కోసం రేణుదేశాయ్‌ను సంప్రదించారట కృష్ణవంశీ. ఆమెకి మనసులో మహేష్ బాబు పక్కన హీరోయిన్గా నటించాలని కోరిక ఉన్న.. అప్పటికే పవన్ కళ్యాణ్ ప్రేమలో ఉన్న ఆమె నో చెప్పేసింది. ఆ తర్వాత సోనాలి బింద్రేని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు.