ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్‌గా బిరుదు దక్కించుకున్న నటి శ్రీదేవి. 50 ఏళ్ల సినిమా కెరీర్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. శ్రీదేవి సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
వెండితెరపై చాలా యాక్టివ్గా కనిపించే శ్రీదేవి అవుట్ఆ ఫ్‌స్క్రీన్ లో మాత్రం చాలా సిగ్గు భయంతో ఉండేదట. పెద్దగా ఎవరితోనూ మాట్లాడేందుకు కూడా ఇష్టపడేది కాదట. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో మాత్రం ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకునేది. ఇక శ్రీదేవి తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ – శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్‌కి మనవరాలుగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత అదే ఎన్టీఆర్ కు జోడిగా హీరోయిన్గా నటించారు. ఇది నిజంగా ఆమెకు ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. రాఘవేంద్రరావు – శ్రీదేవి చేసిన తొలి సినిమా పదహారేళ్ళ వయసు. ఈ సినిమా తర్వాత చాలా రోజులపాటు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. అనంతరం రాఘవేంద్రరావు.. ఎన్టీఆర్‌తో తెరకెక్కించే సినిమాలో శ్రీదేవిని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఇదే విషయాన్ని శ్రీదేవికి చెప్పడంతో ఆమె షాక్ అయింది.
ఎన్టీఆర్ మనవరాలుగా నటించాను.. మళ్లీ ఆయన పక్కన హీరోయిన్గా నటించగలనా అని తటపటాయించిందట. అయితే అంతకుముందే రాఘవేంద్రరావు ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌కి చెప్పి శ్రీదేవి మీ పక్కన హీరోయిన్గా నటిస్తుందని చెప్పడంతో శ్రీదేవి అభిప్రాయం కూడా కనుక్కోమని చెప్పారట. రాఘవేంద్రరావు ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేస్తూ వీరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.