సినిమాలకు ఒకప్పుడు పంచ్ టైటిల్స్ పెడితే హీరో క్రేజ్.. హీరో ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని పెట్టేవారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఎక్కువగా రాముడు అనే పదం టైటిల్ లోకి వచ్చేలా పెట్టినవి ఎన్నో ఉన్నాయి. ఏఎన్ఆర్ అయితే కృష్ణుడు పదం వచ్చేలా టైటిల్స్ పెట్టిన సినిమాలు ఉన్నాయి. హీరో కృష్ణకు అయితే కృష్ణ అన్నది ఓ సెంటిమెంట్ గా ఉండేది. తర్వాత టైటిల్స్ తీరుతెన్నులు మారిపోయాయి. కంటెంట్‌కు దగ్గరగా.. దూరంగా రకరకాల టైటిల్స్ పెడుతున్నారు.
మాస్ మహారాజ్ రవితేజకు కొన్ని టైటిల్స్ అనుకోకుండా భలే గమ్మత్తుగా కుదిరాయని చెప్పాలి. టాలీవుడ్ లో ముగ్గురు సీనియర్ దివంగత హీరోల పేరుతో రవితేజ సినిమాలు చేశారు. నందమూరి తారక రామారావు పేరు కలిసి వచ్చే రామారావు ఆన్ డ్యూటీ – అప్పుడెప్పుడో చిరంజీవి అంటూ చిరంజీవి పేరు కలిసి వచ్చేలా ఓ సినిమా… అక్కినేని నాగేశ్వరరావు పేరు కలిసి వచ్చేలా లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావు… సూపర్‌స్టార్ కృష్ణ పేరుతో కృష్ణ అనే సినిమా చేశారు.
ఇలా సీనియర్ హీరోలు అందరిని కవర్ చేసిన రవితేజ శోభన్‌బాబు పేరుతోనో లేదా శోభన్ అనే పేరు కలిసొచ్చేలా ఓ టైటిల్తో సినిమా తీసేస్తే లెక్క సరిపోతుంది. విచిత్రంగా రవితేజ సినిమాలకు బూతులు, పిచ్చి పిచ్చి పేర్లతోనూ టైటిల్స్ పడ్డాయి. ఖతర్నాక్ – ఇడియట్ – క్రాక్ – షాక్ – బలాదూర్ – మిరపకాయ్ – దరువు – ధమాకా – టైటిల్స్‌తో రవితేజ సినిమాలు చేశాడు. ఇందులో హిట్లు ఉన్నాయి.. ఫట్లు ఉన్నాయి. ఇలా రవితేజ సినిమాల టైటిల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి.