Newsప్ర‌భాస్ భార్య‌, పిల్ల‌ల ఫొటోల్లో ఈ ట్విస్టులు చూశారా... ఎంత ప‌ని...

ప్ర‌భాస్ భార్య‌, పిల్ల‌ల ఫొటోల్లో ఈ ట్విస్టులు చూశారా… ఎంత ప‌ని చేశార్రా..!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. ప్ర‌భాస్‌ వయసు ఇప్పటికే నాలుగు పదులు దాటేసింది. టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలు ఒక్కొక్కరు పెళ్లి చేసుకుంటున్నా ప్రభాస్ ఇంకా పెళ్లికి దూరంగా ఉంటున్నాడు. ప్రభాస్ పెళ్లి వార్త కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులతో పాటు ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి అనేక రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పలానా అమ్మాయితో డార్లింగ్ ఏడడుగులు వేయబోతున్నారంటూ టాక్ నడిచింది. అప్పట్లో బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అనుకున్నారు. ప్రభాస్ మాత్రం పెళ్లి అనే మాట ఎత్తకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత సాహో – రాధేశ్యామ్ – ఆది పురుష్‌ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలేవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఆదిపురుష్‌ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌తో ప్రేమాయణం అంటూ వార్తలు వినిపించాయి.

అందులో ఏమాత్రం నిజం లేద‌ని ఆ బ్యూటీ కొట్టి పారేసింది. ఇక ముందు నుంచి ప్రభాస్ – అనుష్క పెళ్లి జరిగితే బాగుంటుందని ఆశ పడుతూ ఉంటారు ప్రభాస్ అభిమానులు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బిల్లా – మిర్చి – బాహుబలి సినిమాలలో వీరి కెమిస్ట్రీ ఆడియన్స్ కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింది. ఈ ఆన్ స్క్రీన్ జంట‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. ఆన్ స్క్రీన్ లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోను వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో వీరిద్దరూ రియల్ లైఫ్ లో జోడి అయితే బాగుంటుందని చాలామంది అనుకుంటారు.

అటు అనుష్క కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు.. దీంతో వీరిద్దరికి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఏఐ టెక్నాలజీ సాయంతో అతడికి ఓ ఫ్యామిలీని క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో పిచ్చ‌పిచ్చ‌గా వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ప్రభాస్‌కు భార్యతో పాటు వీరికి పిల్ల‌లు కూడా ఉన్నారు. ఇంత‌కు ఈ ఫోటోలో ప్రభాస్ భార్యగా కనిపిస్తోంది ఎవరో కాదు.. అనుష్క కావటం విశేషం.

అనుష్కకు ప్రభాస్కుస్‌కు పెళ్లి జరిగినట్టుగా వీరికి ఒక పాప, బాబు ఉన్నట్టుగా ఫోటోలు డిజైన్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన నెటిజనులు ప్రభాస్ ఎలాగో పెళ్లి చేసుకోవడం లేదు మీరే పెళ్లి చేసేసారు రా బాబు అని కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news