Moviesహిట్ కోసం అలా చేస్తున్న తెలుగు హీరోస్ వీళ్లే.. మామూలు ముదుర్లు...

హిట్ కోసం అలా చేస్తున్న తెలుగు హీరోస్ వీళ్లే.. మామూలు ముదుర్లు కాదుగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సిచువేషన్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సుమంటున్నాయి . దీంతో హీరోస్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు . అంతేకాదు సినిమాకి కూసింత లక్ కలిసి వచ్చేలా తమ గత తాలూకా సినిమాలలో హిట్ అందుకున్న హీరోయిన్స్ ప్రెసెంట్ సినిమాలకు హీరోయిన్స్ గా చూస్ చేసుకుంటున్నారు . కాగా అలా ఎవరు హీరోయిన్స్ లక్ పై హిట్ కొడుతున్నారో ఇప్పుడు మనం చూస్తాం.

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా: వీళ్ల కాంబోలో ఎన్ని సినిమాలు వచ్చాయో ఎన్ని హిట్ అయ్యాయో మనకు తెలిసిందే. కాగా మరోసారి ఈ జంట జతకట్టబోతున్నట్లు తెలుస్తుంది . విజయ్ తిన్నూరి దర్శకత్వంలో శ్రీ లీల హీరోయిన్గా తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి రష్మిక యాడ్ అయినట్లు తెలుస్తుంది.

నాగచైతన్య-సాయి పల్లవి: వీళ్లిద్దరు గతంలో లవ్ స్టోరీ అనే సినిమాలో కలిసిన నటించి హిట్ కొట్టారు. ఆ తర్వాత వీళ్ళ కాంబో తెరపై సెట్ అవ్వలేదు .. మళ్లీ ఇన్నాళ్లకు చందు మొండిటి దర్శకత్వం ద్వారా జతకట్టబోతున్నారు .

కళ్యాణ్ రామ్ – సంయుక్త మీనన్: బింబిసారా సినిమాతో క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్రామ్ .. ఇప్పుడు డెవిల్ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు . ఈ సినిమాలో కూడా హీరోయిన్గా సంయుక్త మీనన్ నే చూస్ చేసుకోవడం గమనార్హం.

చరణ్ – యకిరా అద్వానీ : గతంలో వీళ్ళు వినయ విధేయ రామ సినిమాలో నటించారు . ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ గేమ్ చేంజర్ సినిమా ద్వారా తెరపై కనిపించబోతున్నారు.

నితిన్ – రష్మిక మందన్నా: భీష్మ వంటి హిట్ తర్వాత నితిన్ రష్మిక మందన్నా రెండోసారి నటిస్తున్న విషయం తెలిసిందే . వెంకి కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళ కాంబోపై కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . దీంతో మరోసారి ఇదే కాంబో ని తెలుగులో రిపీట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వెంకీ కుడుముల . ఈ ముగ్గురు కాంబినేషన్లో ఓ సినిమా ఫిక్స్ అయింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news