సాధారణంగా ఇటు తెలుగులోనే కాకుండా.. అటు అనేక భాషల్లోని సినీ రంగంలో అనేక మంది నటులు డాక్టర్లు చదివి యాక్టర్లుగా అవతరించిన వారు ఎందరో ఉన్నారు. వీరిలో రాజశేఖర్ ఒక్కరి గురించే చాలా మందికి తెలుసు కానీ, డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావుతో వీరి ప్రస్తానం ప్రారంభమైంది. అదేవిధంగా
అదేవిధంగా లేడీ నటుల్లోనూ చాలా మంది డాక్టర్లు చదివి సినీ రంగంలోకి అడుగులు వేశారు. వీరిలో నటి లక్ష్మి ఒకరు. ఈమె ఎంబీబీఎస్ ను చదివారు. అయితే.. చివరి సంవత్సరం చదువుతుండగానే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మొదట కాదన్నా.. తర్వాత.. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వస్తుందని భావించిన కుటుంబం ఆమెను సినిమాలవైపు ప్రోత్సహించింది.
అదేవిధంగా ఓల్డ్ యాక్టర్ భానుమతి ఆయుర్వేద డాక్టర్ అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆమె కూడాచివరి సంవత్సరంవరకు చదివినా.. మధ్యలోనే వదిలేసి సినీ రంగం వైపు వచ్చారు. ఇలా అనేక మంది డాక్టర్లుగా రాణించాలని భావించి.. సినిమాలవైపు అడుగులు వేశారు.
ప్రస్తుత నటుల్లో సాయిపల్లవి కూడా డాక్టర్ చదువుతూనే.. సినిమాలవైపు వచ్చారు. సో.. మొత్తానికి డాక్టర్లు కావాల్సిన హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా యాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకోవడం గమనార్హం.