ఇది ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ గా మారిపోయింది.. ఒకసారి సినిమాను తెరకెక్కిస్తే చూడడమే పెద్ద గగనంగా మారితే ..ఆ సినిమాని రెండు భాగాలుగా తెర్కెక్కించడం పెద్ద స్ట్రాటజీగా మారిపోయింది . బాహుబలి సినిమాతో ఇండస్ట్రీలోకి రెండు భాగాలుగా సినిమాలను రిలీజ్ చేసే పద్ధతిని తీసుకొచ్చాడు రాజమౌళి . అయితే ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సైతం కే జి ఎఫ్ ను రెండు భాగాలుగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు .
దీంతో ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ .. తమ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా కొరటాల శివ సైతం దేవర సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాం అంటూ క్లారిటీ ఇచ్చేశారు అంటూ అఫీషియల్ గా ప్రకటించారు . అయితే ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అయిపోతున్నాడు రామ్ చరణ్ . ఆయన హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట .
ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించేందుకు సిద్ధమవుతుంది టీం అంటూ తెలుస్తుంది. దీంతో అన్ని సినిమాలు రెండేసి సార్లు రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉంటే కొత్త హీరోలు కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ..? అంటూ ఫైర్ అవుతున్నారు అభిమానులు. మొత్తానికి చరణ్ – ఎన్టీఆర్ కూడా ప్రభాస్ హిట్ ట్రిక్ ని బాగానే ఫాలో అవుతున్నారు అంటూ రెబల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!