నయనతారను చూస్తుంటే కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం బస్సులో కొచ్చి నుంచి చెన్నైకి వచ్చిన అమ్మాయేనా అని ఆశ్చర్యం కలగక మానదు. కేరళలోని ఎక్కడో మారుమూల గ్రామం నుంచి చిన్న చిన్న ఛాన్సుల కోసం చెన్నై వచ్చిన నయనతార ఇప్పుడు సౌత్ ఇండియాలోనే తిరుగులేని క్రేజీ హీరోయిన్. కోట్లకు పడగలెత్తిన ఆమె చెన్నైలో అధునాతనమైన భవనంలో ఎంతో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో ఛాన్సుల కోసం ఎన్నో అవమానాలు. ఛీత్కారాలు ఎదుర్కొన్న నయనతార నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వ్యక్తిగత జీవితంలో పలుమార్లు చేదు అనుభవాలు చవిచూశారు.
అలా తన జీవితం నేర్పిన గుణపాఠాలతో పాటు నయనతార ఎన్నో అవరోధాలు, అవమానాలు దాటుకొని ఇప్పుడు అందనంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. నయనతార ఒక్కో సినిమాకి 6 నుంచి 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇటీవల నటించిన షారుక్‌ఖాన్ జవాన్ సినిమాతో ఆమె అక్షరాల 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సినీ వర్గాల భోగట్టా.
స్టార్ హీరోయిన్ అంతస్తుకు చేరుకున్న కూడా నయనతార వాణిజ్య ప్రకటనలలో నటించడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు వివాహనంతరం ఆ ఆదాయానికి కూడా గేట్లు తెరిచేశారు. కేవలం 50 సెకండ్ల వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఐదు కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు నయనతార కూడ పెట్టిన ఆస్తులు విలువ రు. 350 కోట్ల పైచిలుకే అని సమాచారం.
నయనతార నటన సినిమా నిర్మాణంతో పాటు ఇతర రంగాల్లోనూ వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇక నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకుడుగా ఉన్నారు. ఏది ఏమైనా 15 ఏళ్లలో ఆమె స్థిర, చరాస్తులు విలువ భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారం చూస్తే ఆమె ఆస్తులు ఇంకా ఎక్కువే ఉండవచ్చు అని సమాచారం.