Newsబాల‌య్య కెరీర్‌లో టాప్ - 10లో ఉండే రెండు క్యారెక్ట‌ర్లు ఇవే...!

బాల‌య్య కెరీర్‌లో టాప్ – 10లో ఉండే రెండు క్యారెక్ట‌ర్లు ఇవే…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ క్యారెక్టర్ కు సంబంధించి ప్రతి సీన్లో ఎంత కష్టమైనా సరే పరకాయ ప్రవేశం చేసి నటిస్తారు. ఇంకా చెప్పాలంటే బాలయ్య నటిస్తారు అనడం కంటే జీవించేస్తారు. బాలయ్య 100 సినిమాల తర్వాత స్పీడ్ పెంచేశారు. ఇటీవల ఆయన 108వ‌ సినిమా భగవంత్‌ కేసరి ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆ వెంటనే బాబి దర్శకత్వంలో తన 109వ సినిమాను పట్టాలెక్కించేశారు.

బాలయ్య 110 -111 సినిమాలు చర్చలు కూడా నడుస్తున్నాయి. బాలయ్య తన సినిమాలో చాలా వరకు యాక్షన్ సన్నివేశాలలో తానే స్వయంగా నటిస్తారు. డూపులు పెట్టి లాగించేసేందుకు ఆయ‌న అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. ఒకసారి సినిమాకు ఓకే చెప్పారు అంటే అస్సలు దర్శ‌కుల పనిలో బాలయ్య ఇన్వాల్వ్ కారు.. బాలయ్య తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించారు.. అయితే ఆదిత్య 369 – భైరవద్వీపం సినిమాలలో ఆయన నటించిన నటన పట్ల తాను చాలా సంతృప్తితో ఉన్నట్టు చాలా సందర్భాల్లో తెలిపారు.

ఈ రెండు సినిమాల్లో క్యారెక్టర్లలో తనని తాను ఎలా ? అయితే యాక్టింగ్ చేయగలడో ఒక టాస్క్ లాగా పెట్టుకుని వైవిధ్యమైన నటన చేసినట్టు ఆయన చెప్పారు. అలా బాలయ్య వైవిధ్యమైన నటనతో ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. విచిత్రమింటంటే ఈ రెండు సినిమాలకు డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు. అలా ఈ రెండు సినిమాలు బాలయ్య బాబు కెరీర్లో ది బెస్ట్ సినిమాలు గా నిలిచిపోయాయి.

బాలయ్య కెరీర్లో టాప్-10 క్యారెక్టర్ల లిస్టు తీస్తే ఈ రెండు సినిమాలలో పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయనే స్వయంగా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇక ఈ రెండు సినిమాల దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 999 సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news