News' భ‌గ‌వంత్ కేస‌రి ' ట్రైల‌ర్ రిలీజ్ టైం వ‌చ్చేసింది.. నంద‌మూరి...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ట్రైల‌ర్ రిలీజ్ టైం వ‌చ్చేసింది.. నంద‌మూరి ఫ్యాన్స్ ర‌చ్చ‌కు రెడీ..!

ఇన్నేళ్ల తర్వాత బాలయ్యకు పట్టిందల్లా బంగారం అవుతుంది. బాలయ్యకు ఒక సూపర్ డూపర్ హిట్ రావడానికి చాలా యేళ్లు పట్టేది. అలాంటిది ఇప్పుడు వరుసగా రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు పడ్డాయి. అఖండ – వీర సింహారెడ్డి రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు. ఇటు బుల్లితెరపై హోస్ట్ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ టాక్‌ షో కూడా సూపర్ డూపర్ హిట్.

ఇప్పటివరకు ఆహా ఓటీటీలో ప్రసారమైన రెండు సీజన్లు ఎంత ? పెద్ద హిట్ అయ్యాయో బాలయ్యను ప్రపంచానికి ఎంత సరి కొత్త‌గా పరిచయం చేసాయో చూశాం. ఇక తాజాగా బాలయ్య ఎనిమిది నెలల గ్యాప్ లో మరోసారి భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాపై నిజం చెప్పాలంటే అఖండ – వీరసింహారెడ్డిని మించిన రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అనిల్ రావుపూడి దర్శకుడు.. కాజల్, శ్రీలీల‌ లాంటి క్రేజీ హీరోయిన్లు ఉన్నారు.

పైగా రు. 100 కోట్ల భారీ బడ్జెట్, తమన్ మ్యూజిక్.. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్, టీజర్లు సినిమాపై అంచనాలు తీసుకువెళ్లి ఆకాశంలో కూర్చోబెట్టాయి. బాలీవుడ్ దర్శకుడు అర్జున్ రాంపాల్ విలన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బాలయ్య పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉన్నా ? ఆయన పాత్ర తాలూకు ఆలోచనలు, యాక్టివిటీస్ చాలా సరదాగా ఉంటాయని తెలుస్తోంది.

తల్లి, కూతుర్ల సెంటిమెంట్తో పాటు చిన్న పాప సెంటిమెంట్ కూడా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయంలో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. భగవంత్‌ కేసరి ట్రైలర్ ఈనెల 8న రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అయితే అప్పటినుంచి సినిమా ఫస్ట్ షో పడే వరకు సోషల్ మీడియాలో నందమూరి అభిమానుల రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news