ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయి అంటే అటు వెండితెర మీద ఇటు బుల్లితెర మీద ఎలాంటి ? క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి , పవన్ కళ్యాణ్ సినిమాలకు తిరుగులేని క్రేజ్ ఉండేది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా వెండితెర మీద తమ అభిమాన హీరోని చూసుకునేందుకు మెగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేవారు. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది.
అసలు మెగా బ్రదర్స్ సినిమాలు వస్తున్నాయంటే మెగా అభిమానులే పట్టించుకోవడం లేదు.. పెద్ద లైట్ తీసుకుంటున్నారు. ఉదాహరణకు చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన రేంజ్ కు తగ్గ హిట్ సినిమా ఏది అంటే ఒక వాల్తేరు వీరయ్య అని మాత్రమే చెప్పాలి. ఖైదీ నెంబర్ 150 వసూళ్ల రాబట్టినా అది రీమేక్ సినిమా.. అంత పేరు కూడా రాలేదు. సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలో పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. అసలు చిరంజీవి సినిమాలకు ఓటీటీలో కూడా సరైన రెస్పాన్స్ రావడం లేదు.
ఇటు బుల్లితెర మీద కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. సరే చిరంజీవికి ఈతరం జనరేషన్ కు కాస్త గ్యాప్ వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ కు ఏమైంది ? పవన్ కళ్యాణ్ సినిమాలది అదే పరిస్థితి. వకీల్‌సాబ్ సినిమా హిట్ అయిన రికార్డులు బ్రేక్ అవ్వలేదు. భీమ్లా నాయక్ సినిమాకు సూపర్ హిట్ వచ్చినా అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇక బ్రో సినిమా పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టారర్. ఈ సినిమాకు పరవాలేదు అన్న టాక్ అయితే వచ్చింది. తమిళంలో హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించారు. అయితే బుల్లితెరపై జీ తెలుగులో ప్రసారం అయితే కేవలం 7.24 రేటింగ్ నమోదు అయింది.
అంతకుముందు భీమ్లానాయక్ సినిమాకు కూడా కేవలం తొమ్మిది రేటింగ్ వచ్చింది. బ్రో సినిమాకు అంతకంటే తక్కువ రేటింగ్ రావడంతో అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చినట్లయింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ సినిమాలకు 18 నుంచి 20 రేంజ్ లో టిఆర్పి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు 10 కూడా రేటింగ్ రాలేదు అంటే సినిమా అభిమానులే కాదు.. మెగా అభిమానులు కూడా పవన్ సినిమాలను ఎంత లైట్ తీసుకుంటున్నారో తెలుస్తోంది. ఏది ఏమైనా టాలీవుడ్ సినీ అభిమానులు మెగా బ్రదర్స్ సినిమాలను కాస్త లైట్ తీసుకుంటున్నట్టే తెలుస్తోంది.