తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) కి మంచి పేరుంది. ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా స్టార్ డైరెక్టర్ అవడానికి పెద్ద సమయం పట్టలేదు. కథతో ఒప్పించి అల్లు అర్జున్, అనుష్క శెట్టి, వరుణ్ తేజ్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి వారిని డైరెక్ట్ చేసే అవకాశాలు అందుకున్నారు. గమ్యం క్రిష్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా.
క్లైమాక్స్ కి చేరుకున్న తర్వాత కూడా ప్రేక్షకుడు ఇంకాసేపు ఉంటే బావుండు అనే భావనలో ఉంటాడు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి, కొండపొలం లాంటి చిత్రాలను రూపొందించారు. వీటిలో ఒక్క కొండపొలం డిజాస్టర్ అవగా మిగతా సినిమాలన్నీ మచి కమర్షియల్ సక్సెస్ సాధించాయి. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా మొదలు పెట్టిన పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు ఎప్పుడు తెరపైకి వస్తుందో పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది.
అయితే, క్రిష్ ఏ హీరోయిన్‌తో సినిమా చేసినా ఆమెకి పూర్తి భరోసా ఇస్తారట. వేదం సినిమా సమయంలో అనుష్క శెట్టితో మంచి బాండింగ్ ఏర్పడింది. ఒకదశలో ఇద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కట్ చేస్తే కంచే భామ ప్రగ్యా జైస్వాల్ తో లవ్ లో ఉన్నట్టు టాక్ వినిపించింది. క్రిష్ ని చూస్తే చాలా డీసెంట్ గా కనిపిస్తారు. సినిమా తప్ప ఇంకో ఆలోచన ఉండదు. కానీ, ఎందుకనో ప్రగ్యా జైస్వాల్ విషయంలో మాత్రం ఎక్కువ రూమర్స్ వినిపించాయి.
ఘనంగా పెళ్ళి చేసుకున్న క్రిష్ ఆ తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రగ్యా వల్లనే క్రిష్ విడాకులు తీసుకున్నారనే మరో ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. కానీ, ఇప్పుడు క్రిష్ అసలు ప్రగ్యాని పట్టించుకోవడం లేదట. పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం ఉన్నా ప్రగ్యాకి కాకుండా నిధి అగర్వాల్ కి ఛాన్స్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. అసలు ఇప్పుడు ఛాన్సుల్లేని ప్రగ్య ఫోన్ చేసినా క్రిష్‌కు పట్టించుకునే తీరిక కూడా ఉండదన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి నిజంగా ప్రగ్యా ఈ దర్శకుడుపైన అంత నమ్మకం పెట్టుకుందా అనేది ఆమెకే తెలియాలి.