మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు ఇప్పటికీ టీవీల ముందు అతుక్కుపోయి ఆయన అభిమానులు ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నా 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చినా కూడా ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చిరంజీవి చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాయి. మంచి కథ పడితే చిరంజీవి మార్కెట్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ రెండు సినిమాలే నిదర్శనం.
చిరంజీవి కెరీర్ మొదట్లో చిన్న వేషాలు వేస్తూ కనిపించే వారు. అయితే చిరంజీవికి ఒక్కసారిగా తిరుగులేని స్టార్డం తెచ్చి పెట్టిన సినిమా ఖైదీ. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో చిరంజీవికి తెలుగు ప్రేక్షకులను తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమా విడుదలై 47 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ రోజుల్లోనే ఖైదీ సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్‌గా రూ.1.75 లక్షలు నిర్మాతలు ఇచ్చారు. ఈ సినిమా నిర్మాతలది నెల్లూరు.
ఈ సినిమాను 40 రోజుల్లో మూడు షెడ్యూల్స్‌తో పూర్తి చేశారట. సినిమా మొత్తం పూర్తయ్యాక నిర్మాతలు తమకు సన్నిహితులుగా ఉన్న దివంగత నేత మాగంటి సుబ్బరామిరెడ్డికి చూపించగా ఈ సినిమా అంతగా ఆడదు మీకు నష్టాలు వస్తాయి అని సేఫ్ అయిపోమని సూచించారట. అయితే నిర్మాతలకు ఇష్టం లేకపోయినా ఆయన మాట కాదనలేక డిస్ట్రిబ్యూటర్లకు రూ.25 లక్షలకు అమ్మితే ఆ రోజుల్లోనే కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది.
అలా ఈ సినిమా ఉన్న ప్రతి ఒక్కరి పంట పండించేసింది. ఇక ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిరంజీవి ఓ ట్విట్ చేశాడు. ఖైదీ సినిమా నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ఖైదీలు చేసింది.. నా జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్.. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిదని చిరు తెలిపారు.
చిరు అప్పటి జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఆ సినిమా దర్శకులు ఏ కోదండరామిరెడ్డి గారిని నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీం తో పాటు రచయితలు పరుచూరి సోదరులను నా కో స్టార్స్ సుమలత, మాధవిలను అభినందిస్తున్నానని ఇంత గొప్ప విజయం మాకు అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చిరు ట్వీట్ చేశారు.