“నువ్వు నాకు నచ్చావ్” సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఆర్తి అగర్వాల్. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆర్తి ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఇంద్ర, నీ స్నేహం, నేనున్నాను, నువ్వు లేక నేను లేను వంటి సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చుడిదార్, చీర ఇలా భారతీయ వస్త్రధారణలో ఈ తార ఎంతో అందంగా కనిపించేది. కుర్రకారుకు ఒకానొక సమయంలో డ్రీమ్ గర్ల్ గా కూడా మారింది.
సౌందర్య లాగా పెద్ద హీరోయిన్ అవుతుందని చాలామంది అప్పట్లో అనుకున్నారు. కానీ సౌందర్య లాగానే చిన్న వయసులో నుంచి చనిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఆర్తి అగర్వాల్ కేవలం 31 సంవత్సరాలకే కన్ను మూసింది. ఆమె మరణం అప్పట్లో టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక షాక్‌లా తగిలింది. లైపోసక్షన్ సర్జరీ చేయించుకున్న ఆరువారాల నుంచి ఆమె అనారోగ్యం పాలయ్యిందని, శ్వాసకోశ సమస్యలతో బాధపడిందని, కార్డియాక్ అరెస్టుతో మరణించిందని అప్పట్లో ఆమె మేనేజర్ చెప్పుకొచ్చాడు.
అయితే ఆమె అలా చనిపోలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెబుతున్న వారూ ఉన్నారు.
ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ అంత చిన్న వయసులోనే చనిపోవడానికి కారణం ఆమె కుటుంబ సభ్యులేనని వాదనలు చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఇద్దరి హీరోలు ఆర్తి అగర్వాల్ ని వాడుకొని మోసం చేశారని కూడా అంటారు. ఆర్తి 2007లో తస్వాల్ కుమార్ ను పెళ్లి చేసుకుంది.
పెళ్లయ్యాక కూడా ఆమె తనకు సినిమాల నుంచి వచ్చిన డబ్బంతా తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్ లోనే వేసేదట. ఈ విషయంలో గొడవ వచ్చి పెళ్లయిన రెండు సంవత్సరాల్లోనే తస్వాల్ విడాకులు ఇచ్చాడని ఒక ప్రచారం ఉంది. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని తల్లిని అడిగితే అందుకు ఆమె నిరాకరించిందట.
దాంతో తన పెళ్లిని నిలబెట్టుకోలేకపోయానని డిప్రెషన్ తో ఆర్తి అగర్వాల్ ఆరోగ్యాన్ని పాడు చేసుకుందని అంటారు. అదే ఆమె మరణానికి కారణం అయ్యిందని కొందరు వాదనలు వినిపిస్తుంటారు. ఏది ఏమైనా ఒక మంచి నటిని చాలా త్వరగా కోల్పోవడం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.