Newsప‌వ‌న్ క‌ళ్యాణ్ - త‌రుణ్ కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా ఇదే..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – త‌రుణ్ కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా ఇదే..!

కొన్ని క్రేజీ కాంబినేషన్ సినిమాలు అనుకోని కారణాలవల్ల మిస్ అవుతుండటం చాలాసార్లు జరుగుతుంది. ఆ తర్వాత కొన్నాళ్ల‌కు ఆ కాంబినేషన్ మిస్ అయింది అని తెలిసిన తర్వాత సినీ అభిమానులు అయ్యో మంచి కాంబినేషన్‌లో సినిమా మిస్ అయ్యామా అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి క్రేజీ కాంబినేషన్‌లో మిస్ అయిన సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఒకప్పటి క్రేజీ హీరో తరుణ్ కాంబినేషన్ ఒక‌టి.

ఈ ఇద్దరు 20 సంవత్సరాల క్రితం యూత్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి ఏర్పడిన కల్ట్ ఫాలోయింగ్ తరుణ్ కి ఏర్పడలేదు. కొంతకాలం లేడీస్, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆ ఫాలోయింగ్ కొనసాగింది. మధ్యలో సరైన స్క్రిప్టులు లేక వరుస ఫ్లాపులతో అవ‌కాశాలు కోల్పోయాడు. ఆ తర్వాత బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ దూసుకుపోతున్నాడు. తరుణ్ కు హైదరాబాద్‌లో రెండు మూడు పబ్బులతో పాటు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే 2006లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా బంగారం తమిళంలో ధూల్‌ లాంటి విజయవంతమైన సినిమా తెరకెక్కించిన ధరణి బంగారం సినిమాకు దర్శకుడు. శ్రీ సూర్య మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే సరిగా ఆడలేదు. పవన్ కళ్యాణ్ రేంజ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం.. పవన్‌కు హీరోయిన్ లేకపోవటం ఇవన్నీ ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. ఈ సినిమాలో హీరో రాజా క్యారెక్టర్ ఎంత ముఖ్యమైనదో తెలిసిందే.

రాజాకు జోడిగా మీరా చోప్రా నటించారు. రాజా హీరోయిన్ మీరా చోప్రాని కలిపే ప్రయత్నంలోనే పవన్ కళ్యాణ్ పాత్ర నడుస్తుంది. హీరో రాజా పాత్ర కోసం ముందుగా తరుణ్‌ని అనుకున్నాడట డైరెక్టర్ ధరణి. కానీ తరుణ్ హీరో పాత్రలకు మినహాయిస్తే ఇలాంటి పాత్రలో తాను నటించనని నాకు అవకాశాలు రాకపోయినా పర్లేదు.. ఇలాంటి పాత్రలు చేయనని చెప్పాడట. దీంతో ధరణి రాజాని అప్రోచ్ అయ్యి ఈ కథ చెప్పగా వెంటనే ఓకే చెప్పారు. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ థియేటర్లలో నడుస్తున్న టైం లో రిలీజ్ అయిన బంగారం అప్పట్లో నెగటివ్ టాక్ తో కూడా రూ.18 కోట్లకు పైగా షేర్ వసూలు రాబట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news