Newsనేను ఆ జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నా... పిల్ల‌ల భ‌విష్య‌త్తు చూస్తే బాధేస్తోంది.. భ‌యంక‌ర...

నేను ఆ జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నా… పిల్ల‌ల భ‌విష్య‌త్తు చూస్తే బాధేస్తోంది.. భ‌యంక‌ర నిజం చెప్పిన రేణుదేశాయ్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ సంచలన విషయం బయటపెట్టారు. తాను గుండె జబ్బుతో బాధపడుతున్నాన్న విషయాన్ని ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె బయట పెట్టారు.
తనకు పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని ఆమె గతంలోనూ చెప్పారు. ఇప్పుడు దీనిపై మరింతగా స్పందించారు. పుట్టుకతోనే నాకు గుండె జబ్బు ఉంది.. ఆ విషయం నాకు తెలియదు.

ఇంట్లో బాగోలేదని చిన్నచిన్న టెస్టులు చేశాం.. ఈ సమస్య ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. చిన్నచిన్న టెస్టులు చేసిన అర్థం కాలేదు. ఫైనల్ గా సిటీ స్కాన్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. మా నాన్నమ్మకు కూడా ఇదే సమస్య ఉండేది. ఆమె 47 ఏళ్లకే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.. మా నాన్న కూడా హార్ట్ ఎటాక్ తో చిన్న వయసులోనే చనిపోయారు.. అందుకే తాను జాగ్రత్తగా ఉంటానని రేణు చెప్పారు.

ఆరోగ్యకరమైన జీవితం గడుపుతాను.. మంచి ఆహారం తింటాను.. యోగా చేస్తాను.. తిండి విషయంలో చాలా కంట్రోల్ గా ఉంటాను.. నాకు అస్సలు కొలెస్ట్రాల్ లేదు.. బైపాస్ సర్జరీ అవసరం లేదు.. అయితే పుట్టుకతోనే గుండె సమస్య ఉన్నందున జాగ్రత్తగా ఉంటున్నట్టు తెలిపింది. ఇలా తాను గుండె జబ్బుతో బాధపడుతున్నానని షాకింగ్ విషయాన్ని రేణూ బయటపెట్టింది. ప్రస్తుతం మందులు వాడుతున్నానని అందుకే బరువు పెరగానని కూడా తెలిపారు.

ఈ సమస్య వల్లే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది.. హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది.. అది తగ్గించడం కోసం మెడిసిన్ వాడుతున్నాను.. అందుకే బరువు పెరిగానని రేణు తెలిపారు. ఇక తన జీవితం ఇలా హార్ట్ ప్రాబ్లమ్ తోనే ఉంటుందని రేణు దేశాయ్ చాలా ఎమోషనల్ గా చెప్పారు. పిల్లల భవిష్యత్తు తలుచుకుని తాను ఎంతో బాధపడుతూ ఉంటానని.. మెట్లు ఎక్కువగా ఎక్కటం.. పరిగెత్తడం చేయకూడదని.. టెన్షన్ తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news