టాలీవుడ్ లో గత కొన్నేళ్ళుగా సంక్రాంతికి ఒకేసారి రెండు నుంచి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి సంక్రాంతికి ముందు సినిమాలకు థియేటర్లు కేటాయించే విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఒకానొక టైం లో నాన్నకు ప్రేమతో – డిక్టేటర్ – సోగ్గాడే చిన్నినాయన సినిమాలు వచ్చినప్పుడు థియేటర్ల కోసం యుద్ధాలు జరిగాయి. ఆ తర్వాత అలవైకుంఠపురంలో – సరిలేరు నీకెవ్వరు సినిమా టైంలోనూ అలాగే జరిగింది. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి – విజయ్ వారసుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్ల కోసం ఎంత రచ్చ జరిగిందో చూసాం.
ఇక 2024 సంక్రాంతికి కూడా టాలీవుడ్ లో థియేటర్ల కోసం రచ్చ మామూలుగా ఉండేలా లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరేడు సినిమాలు ఈసారి ఖర్చీఫ్ వేసుకుని కూర్చున్నాయి. మహేష్ బాబు – త్రివిక్రమ్ గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. నాగార్జున – యువ దర్శకుడు విజయ్ బిన్ని నా సామిరంగా జనవరి 13 అంటున్నారు. మరో యుడనటుడు తేజసజ్జా – ప్రశాంత్ వర్మ భారీ ఇండియా మూవీ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నా తాము రిలీజ్ డేట్ మార్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
రవితేజ – కార్తీక్ ఘట్టమనేని యాక్షన్ థ్రిల్లర్ ఈగిల్ కూడా జనవరి 12న రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ – పరశురాం పెట్ల ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా సంక్రాంతి బరిలోనే నిలుస్తుందని చెప్పారు. వెంకటేష్ సైంధవ – రజనీకాంత్ లాల్ సలాం – శివ కార్తికేయన్ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి. చూస్తుంటే ఈ 7 – 8 సినిమాలు అందులోనూ అందరూ స్టార్ హీరోలవే కనిపిస్తున్నాయి.
ఇంకా సంక్రాంతి మరో మూడు నెలల సమయం ఉండడంతో.. మరో మూడు నాలుగు సినిమాలు కూడా సంక్రాంతి రేసులో ఉన్న ఆశ్చర్య పోనక్కర్లేదన్న ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఈసారి కూడా సంక్రాంతికి థియేటర్ల కోసం పెద్ద యుద్దం జరిగేలా ఉంది. మరి సంక్రాంతి టైం వచ్చేసరికి ఎవరు రేసులో ఉంటారో ఎవరు ? వెనక్కి తగ్గుతారో.. ఇదే టైంలో వీరి మధ్య పంతాలు ఎలా ఉంటాయో ? చూడాలి.