Movies"ఆ హీరో నా కోరిక తీరుస్తా అని ప్రామిస్ చేశాడు"..ప్రియమణి షాకింగ్...

“ఆ హీరో నా కోరిక తీరుస్తా అని ప్రామిస్ చేశాడు”..ప్రియమణి షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ ల పై ఫోకస్ కూసింత ఎక్కువగానే ఉంటుంది . మరీ ముఖ్యంగా ఏ స్టార్ సెలబ్రిటీ ఎప్పుడు మాట తూలుతారు వాళ్ళను ట్రోల్ చేద్దాం అని కాచుకొని కూర్చుంటున్నారు కొందరు మీమర్‌స్. ఈ క్రమంలోనే ప్రియమణి అలాంటి ట్రోలర్స్ చేతికి చిక్కిపోయింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం స్టార్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతుంది .

జవాన్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ బ్యూటీగా మారిపోయిన ప్రియమణి .. ప్రజెంట్ పలు వెబ్ సిరీస్, సినిమాలో నటిస్తుంది. కాగా ఇలాంటి క్రమంలోనే పుష్ప2 సినిమాలో కూడా నటించబోతుంది అంటూ ప్రచారం జరిగింది . రీసెంట్ ఇంటర్వ్యూలో దానిపై కూడా క్లారిటీ ఇచ్చేసింది ప్రియమణి . “నాకు పుష్ప2 నుండి అవకాశం రాలేదు అని.. వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చింది”.

ఇదే క్రమంలో అల్లు అర్జున్ తో నటించాలని ఎప్పటినుంచి కోరికగా ఉందని.. అల్లు అర్జున్ ఈవెంట్లో కలిసినప్పుడు మాట్లాడుతూ మీ కోరిక తీరిపోతుందిలే త్వరలోనే అంటూ చెప్పుకొచ్చారని ..ఆయన చెప్తే అది కచ్చితంగా జరుగుతుందని.. త్వరలోనే ఆ అవకాశం నాకు వస్తుంది అంటూ ఆశపడుతున్నాను అని చెప్పుకు వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ప్రియమణి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news