Movies"సచ్చిన శవాన్ని తీసుకొచ్చి బ్రతికించమంటే ఎలా..?"..బోయపాటి పై ధమన్ సీరియస్ ...

“సచ్చిన శవాన్ని తీసుకొచ్చి బ్రతికించమంటే ఎలా..?”..బోయపాటి పై ధమన్ సీరియస్ ..ఇచ్చిపడేశాడుగా(Video)..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా కావాలనే కొందరు తమన్ పై నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోని స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను .. స్కంద ఫెయిల్యూర్ కు టోటల్ కారణం మ్యూజిక్ అంటూ ఓ ఈవెంట్లో చెప్పడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

అయితే బోయపాటి శ్రీనుకు తాజాగా కౌంటర్ వేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ . రీసెంట్గా ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన సినిమా భగవంత్ కేసరి . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది . దీంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ మాట్లాడుతూ .. పరోక్షకంగా బోయపాటికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు .

ఆయన మాట్లాడుతూ ..”సీన్ లో.. ఎమోషన్ లేకపోతే ..నేను ఎంత కొట్టినా అది వేస్ట్ ..వర్కౌట్ కాదు ..డైరెక్టర్ రాసే సీన్స్ కూడా మంచిగా రాయాలి.. సచ్చిన శవాన్ని తీసుకొచ్చి బతికించమంటే ఎలా..? ప్రతి టెక్నీషియన్ ..ప్రతి మనిషి ..ఆ సినిమాకి వర్క్ చేసే వాళ్ళు .. ఎంతో నమ్మకంగా వర్క్ చేస్తారు.. బెస్ట్ ఇవ్వడానికే చూస్తారు. తన వర్క్ బాలేదన్నారని ట్రోల్ చేశారని బాధపడడం కూడా కామన్ నే.. కానీ పని చేసిన సినిమా వాళ్ళే టీం వర్క్ ను తక్కువ చేసేలా కామెంట్స్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ ..? మీరే చెప్పండి..?” అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో ఈ కామెంట్స్ బోయపాటికి వర్తిస్తాయి అంటూ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news