News"ముందు మీ అబ్బాయిలకి అది నేర్పించండి"..కొడుకులు కన్నవాళ్లకి అనసూయ ఉచిత సలహా..!!

“ముందు మీ అబ్బాయిలకి అది నేర్పించండి”..కొడుకులు కన్నవాళ్లకి అనసూయ ఉచిత సలహా..!!

అనసూయ .. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..ఒక స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ట్రెండ్ అవుతుంది . ట్రోలింగ్ కి గురవుతుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ స్టార్ హీరోయిన్స్ తప్పులు చేసిన వదిలేస్తున్న జనాలు ..అనసూయ చిన్న పోస్ట్ పెడితే తెగ ట్రెండ్ చేస్తున్నారు . మరి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.

మరి కొంతమంది ఆమె పాజిటివ్ గా ట్విట్ చేసిన ..మెసేజ్ చేసిన ..దాన్ని భూతద్దంలో పెట్టి చూసి లేనిపోని నెగిటివ్ కోణాల ని వెతుకుతున్నారు . రీసెంట్గా అనసూయ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది . మీ కొడుకులకి కనీసం కొన్ని కొన్ని పనులు నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఓ పోస్ట్ పెట్టుకొచ్చింది .

“మీ కొడుకులకి ఇంట్లోని కుకింగ్ – క్లీనింగ్ బేసిక్ స్కిల్స్ నేర్పించాలి “అంటూ పోస్ట్ చేసింది . ఆడ మగ అని తేడా లేకుండా అన్ని పనులు నేర్పించాలి అంటూ ఓ పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అనసూయ. ఇందులో ఏ మాత్రం తప్పులేదు.. కానీ సోషల్ మీడియాలో కొందరు జనాలు మాత్రం ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు . నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ముందు నువ్వు నేర్పు అంటుంటే ..మరికొందరు ఆమెను దారుణంగా నెగటివ్ కామెంట్స్ తో ఇబ్బందికర మాటలతో హర్ట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో అనసూయ పెట్టిన పోస్ట్ మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news