మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయింది. నిజం చెప్పాలంటే చిరు రీయంట్రీ ఇచ్చాక ఆయనకు కమర్షియల్ గా తిరుగేలేని సక్సెస్ ఇచ్చింది వీరయ్య సినిమా. తాజాగా వచ్చిన భోళాశంకర్ సినిమా డిజాస్టర్ కావడంతో పాటు చిరు పరువు తీసేసింది. ఇక చిరంజీవి ఇప్పుడు రెండు సినిమాలను లైన్లో పెట్టారు.
ఒకటి తన కుమార్తె కొణిదల సుష్మిత నిర్మాతగా సినిమా అనుకున్నారు. కురసాల కళ్యాణకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఇక ఆ తర్వాత యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో బింబిసారా దర్శకుడు వశిష్ట తెరకెక్కించే సినిమా మరొకటి. ఈ రెండు సినిమాలలో ముందుగా సుష్మిత సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. ఈ సినిమా కథ ఇతర పనుల కోసం ఆఫీస్ కూడా ఓపెన్ చేయకుండానే కోటిన్నర ఖర్చుపెట్టినట్టు టాక్. అయితే ఇప్పుడు ముందు అనుకున్న కథను పక్కన పెట్టేశారు.
ఈ లోగా చిరంజీవి మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దాదాపు రెండు మూడు నెలలు ఆయన విశ్రాంతి తీసుకోనన్నారు. అసలే భోళా శంకర్ సినిమా ఆయన మార్కెట్‌ను పూర్తిగా బోల్తా కొట్టించేసింది. ఈ సినిమా తర్వాత సుస్మిత సినిమా చేస్తే చాలా పెద్ద రిస్క్ అని చిరంజీవి భావిస్తున్నారు. సుస్మిత తండ్రి చిరు మీద రు.100 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అటు దర్శకుడు కళ్యాణకృష్ణ మరీ అంత పేరున్న దర్శకుడు అయితే కాదు.
అందుకు చిరు సైలెంట్‌గా సుస్మిత ప్రాజెక్టును పక్కన పెట్టేసి వశిష్ట సినిమా లైన్లో ఉన్నారట. ఇది పంచభూతాల కాన్సెఫ్ట్‌తో నడుస్తోంది. అసలు చిరుకు ముందు నుంచి సుస్మిత అంత బడ్జెట్ పెట్టి తనతో సినిమా చేయడం చిరుకు ఇష్టం లేదు. ఇప్పుడు తన ప్రాజెక్ట్‌ను వదిలేసి వశిష్ట – యూవీ బ్యానర్లో ప్రాజెక్టే ముందు చేయాలనుకోవడం.. సుస్మితతో నీ ప్రాజెక్ట్ తర్వాత చూద్దాం అని చెప్పడం సుస్మితకు నచ్చలేదని టాక్.
సుస్మిత వెర్షన్ వేరేలా ఉంది. తన బ్యానర్లో తన తండ్రితో ఓ ప్రెస్టేజియస్ సినిమా తీస్తే తన బ్యానర్‌కు, తనకు మంచి పేరు వస్తుందని.. ఆ తర్వాత ఇతర హీరోలతో వరుసగా సినిమాలు చేయవచ్చన్నదే ఆమె ప్లాన్. తన ప్రయత్నానికి తండ్రి నుంచే ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతుండడంతో సుస్మిత తన బాధ ఎవ్వరితో చెప్పుకోలేక.. ఏం చేయలేక సతమతమవుతోందట.