భార్యాభర్తలు అన్నాక గొడవలు ..తగాదాలు.. చాలా సహజం . మ్యారీడ్ లైఫ్ లో గొడవలు లేకపోతే మంచి కిక్ ఉండదు అని చాలామంది ఫన్నీగా చెబుతూ ఉంటారు . అయితే సామాన్య జనాల లైఫ్ లో మాత్రమే ఇలాంటి గొడవలు ఉంటాయా..? కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని వేలకోట్ల ఆస్తికి అధిపతి అయిన స్టార్ సెలబ్రిటీస్ మధ్య ఇలాంటి గొడవలు ఉండవా..? అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే దానికి సమాధానం ఎస్ అనే వినిపిస్తుంది .
ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా కోట్లకు పడగలెత్తిన భార్యాభర్తల మధ్య తగాదాలు సర్వసాధారణం . ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నారు మెగా కపుల్స్ ఉపాసన రాంచరణ్ . వీళ్ళ పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది . పెళ్లయిన పదేళ్లకు వీళ్ళకు మొదటి సంతానం కలిగింది . క్లీన్ కార పుట్టిన తర్వాత చరణ్ ఉపాసన చాలా బిజీ బిజీ అయిపోయారు . కాగా ఇలాంటి క్రమంలోనే వీళ్ళకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికీ రామ్ చరణ్ ఉపాసన ఓ విషయంలో చాలా గొడవలు పడుతూ ఉంటారట .
అదే టైం మేనేజ్మెంట్ . ఉపాసన చాలా స్ట్రిక్ట్ ఏ టైం కి ఆ పని జరగాలి అనే అమ్మాయి . అయితే రామ్ చరణ్ చాలా చాలా బద్ధకస్తుడట చెప్పిన గంటకు గాని ఆ పని చేయడట . ఈ క్రమంలోనే ఇప్పటికీ ఉపాసన చరణ్ ల మధ్య టైం మేనేజ్మెంట్ విషయంలో తగాదాలు వస్తూనే ఉంటాయట . మెగా కాంపౌండ్ నుంచి లీకై ఈ న్యూస్ ఇప్పుడు నెట్ వైరల్ గా మారింది . అయితే ఫ్యాన్స్ కావాలని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు చరణ్ కన్నా ఉపాసన పెద్దది అందుకే ఆమెకు మంచి చెడు తెలుసు ..చరణ్ చిన్నవాడు కదా అందుకే ఇంకా నేర్చుకోలేకపోతున్నాడు అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!